త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మొహబ్బత్ కీ దుకాన్.. హిట్లర్ కా మకాన్ అయిందా?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న!

KTR | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివాదాస్పద వ్యాఖ్యల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ (Congress) అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Jun 9, 2026, 6.19 am IST

KTR | మొహబ్బత్ కీ దుకాన్.. హిట్లర్ కా మకాన్ అయిందా?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న!
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివాదాస్పద వ్యాఖ్యల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ (Congress) అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చే జాతీయ నినాదం`మొహబ్బత్ కీ దుకాన్` కాస్తా, ఆయన స్వయంగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి క్రూర నియంత వారసత్వాన్ని అక్కున చేర్చుకోవడంతో తెలంగాణలో `హిట్లర్ కా మకాన్` (హిట్లర్ ఇల్లు) గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నైతికతలోని ద్వంద్వ ప్రమాణాలను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ పాలనా విధానాలకు, స్థానిక కూల్చివేతలకు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఆయన హంతక ముఠా (అస్సాస్సినేషన్ స్క్వాడ్) స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడంతో ఈ రాజకీయ వివాదం చెలరేగింది. అంతేకాకుండా, ఈ స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల విధ్వంసంతో ఎంతో గర్వంగా పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఫాసిస్ట్ విధానాల‌పై..

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వారి ఫాసిస్టు పాలనా ఆలోచనా విధానానికి నిదర్శనమని, ఇది దేశ పునాది విలువలపై జరిగిన క్షమించరాని దాడి అని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వహిస్తున్న వ్యూహాత్మక మౌనాన్ని వీడాలన్నారు. ముఖ్యమంత్రిని మందలించకపోతే, ఆ నియంతృత్వ పద్ధతులను అధిష్టానం సమర్థించినట్లే అవుతుందని హెచ్చరించారు.

`డియర్ రాహుల్ గాంధీ జీ.. మీ 'మొహబ్బత్ కీ దుకాన్' అధికారికంగా 'హిట్లర్ కా మకాన్' అయిందా..? అని నిల‌దీశారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్రూర హిట్లర్‌ను కీర్తిస్తూ, అతని 'హంతక ముఠా'లను పాలనా స్ఫూర్తిగా పేర్కొంటుంటే.. మీరు మౌనంగా ఉంటూ, ఢిల్లీలో రాజ్యాంగానికి తానే స్వయంప్రకటిత రక్షకుడినని ఎలా చెప్పుకుంటారు?` అని ప్ర‌శ్నించారు. ఒక ప్రజాస్వామ్య నాయకుడు నిజమైన రాజనీతిజ్ఞుల నుంచి స్ఫూర్తి పొందుతాడని, కేవలం అధికారం తలకెక్కిన, పారనాయిడ్ పాలకుడు మాత్రమే క్రూర నియంతల నుంచి పాఠాలు వెతుక్కుంటాడని వ్యాఖ్యానించారు.

సిద్ధాంతాల ముసుగును తీసేయండి..

నియంతృత్వ పద్ధతులను సెలబ్రేట్ చేసుకోవడం, స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల విధ్వంసంతో గర్వంగా పోల్చడమే మీ పార్టీ అసలు పాలనా విధానం అయితే.. ఏఐసీసీ తన సిద్ధాంతాల ముసుగును తీసివేసి 'ఆల్ ఇండియా నాజీ పార్టీ'గా పేరు మార్చుకోవాలి. మీ మౌనం ఈ వ్యాఖ్యలను అంగీకరించినట్లే అవుతుంది. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement