AI Summit | ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసనలు.. షర్ట్స్ తీసేసి
AI Summit | ఢిల్లీలో జరుగుతున్నఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Impact Summit 2026)లో యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Workers) ఆందోళనకు దిగారు.
AI Summit | ఢిల్లీలో జరుగుతున్నఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Impact Summit 2026)లో యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Workers) ఆందోళనకు దిగారు. ఇటీవలే ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌కు (India-US Trade Deal) నిరసనగా ఆందోళన చేపట్టారు. చొక్కాలు విప్పి వేదిక వద్ద నిరసన (Protest) తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనలతో ప్రపంచ నాయకులు, అగ్రశ్రేణి సీఈవోలు పాల్గొన్న సమ్మిట్‌లో గందరగోళం నెలకొంది.
దీంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణహరి, బీహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త నరసింహ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో సమ్మిట్ ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
సమ్మిట్ వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ మండిపడింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం దేశ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిరసనలు తెలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://x.com/ANI/status/2024757981146206518
సంబంధిత వార్తలు

Medical Shops | రాష్ట్రంలో 25 వేలకు పైగా మెడికల్ షాపులు బంద్.. వాటికి మినహాయింపు..
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



