త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VK Shashikala | త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేళ‌.. కొత్త పార్టీ ప్ర‌క‌టించిన శ‌శిక‌ళ‌

VK Shashikala | అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత (former Chief Minister Jayalalithaa) సన్నిహితురాలు వీకే శశికళ (VK Shashikala) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆల్‌ ఇండియా పురచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేట్ర కజగం (All India Puratchi Thalaivar Makkal Munnetra Kazhagam) పేరుతో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు.

D

National | Published On Mar 13, 2026, 4.25 pm IST

VK Shashikala | త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేళ‌.. కొత్త పార్టీ ప్ర‌క‌టించిన శ‌శిక‌ళ‌
Advertisement

VK Shashikala | త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత (former Chief Minister Jayalalithaa) సన్నిహితురాలు వీకే శశికళ (VK Shashikala) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆల్‌ ఇండియా పురచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేట్ర కజగం (All India Puratchi Thalaivar Makkal Munnetra Kazhagam) పేరుతో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. కొబ్బ‌రి చెట్ల స‌మూహాన్ని పార్టీ గుర్తుగా వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను శుక్ర‌వారం ఉద‌యం మీడియాకు వెల్ల‌డించారు.

తమిళనాడు ప్రజల కోసం కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా త‌మ‌ పార్టీ పనిచేస్తుందని శశికళ స్ప‌ష్టం చేశారు. తమ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందని చెప్పారు. చెట్ల స‌మూహం ఐక్యతకు గుర్తు అని వివ‌రించారు. జయలలిత మరణం తర్వాత తాను సీఎంగా నియమించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు మౌనంగా ఉన్నానని.. ఇలాగే ఉంటే కార్యకర్తలకు, ప్రజానీకానికి ద్రోహం చేసినట్లు అవుతుంద‌ని వెల్ల‌డించారు.

Also Read..

ప్రొటోకాల్ వివాదం.. తృణ‌మూల్ నేత‌ల‌కు అపాయింట్‌మెంట్ నిరాక‌రించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

వంట‌గ్యాస్ పై అపోహ‌లొద్దు.. కావాల్సినంత ఉంది

ఐక్యూ నుంచి జ‌డ్‌11ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

Advertisement
Advertisement