త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutta Sukhendar Reddy | ఏసీబీకి ప‌ట్టుబ‌డితే క‌ఠిన శిక్ష‌లు ఉండాలే

Gutta Sukhendar Reddy | ప్ర‌భుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోతోంద‌ని.. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయ‌లు వెన‌కేసుకుంటున్నార‌ని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి అన్నారు. ఏసీబీకి ప‌ట్టుబ‌డిన వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాల‌న్నారు.

S

Telangana | Published On Jun 21, 2026, 6.20 pm IST

Gutta Sukhendar Reddy | ఏసీబీకి ప‌ట్టుబ‌డితే క‌ఠిన శిక్ష‌లు ఉండాలే
Advertisement
  • అధికారుల్లో అవినీతి పెరిగిపోతోంది
  • చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లు వెన‌కేస్తున్నారు
  • రిటైర్డ్ అయిన వారికి మ‌ళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వొద్దు
  • మీడియాతో చిట్ చాట్‌లో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌లు

Gutta Sukhendar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోతోంద‌ని.. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయ‌లు వెన‌కేసుకుంటున్నార‌ని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి అన్నారు. ఏసీబీకి ప‌ట్టుబ‌డిన వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాల‌న్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల‌కు మ‌ళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వొద్ద‌ని సూచించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో ఆదివారం నిర్వ‌హించిన‌ చిట్ చాట్ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు.

ఎమ్మెల్యేకు పోటీ చేస్తే రూ.100 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్న‌రు..

కోట్ల రూపాయలు, బంగారం లాకర్ల‌లో దొరుకుతున్నాయి. ఏసీబీ కేసులో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో రాజకీయాల్లో ఉండేవారు జెండా పట్టుకొని పని చేసేవారే ప్రజాప్రతినిధులుగా ఉండేది. కానీ ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు డబ్బున్న వారే రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నారు అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉందా లేదా? చిన్న చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయలు వెనకేస్తున్నారు. 10% రాజకీయ నాయకులే డబ్బులు సంపాదిస్తారు. రైతు భ‌రోసా విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. సేద్య యోగ్యమైన భూములకే రైతు భ‌రోసా ఇవ్వాలి అని గుత్తా డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో పెరిగిపోతున్న ఖర్చుల కోసమే విపరీతమైన స్కాములు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాం నుంచి విపరీతమైన ఎన్నికల ఖర్చులు పెరిగాయి. ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు పార్లమెంట్ స్థాయిలో పకడ్బందీగా చట్టాలు చేయాలి. ధరణిలో అవినీతి జరిగిందని అనుకుంటే భూభారతి వచ్చాక కూడా అవినీతి మరింత విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా అధికారులలో మార్పులు రావడం లేదని, కఠిన చట్టాలు తీసుకొచ్చి అవినీతి అధికారుల పని పట్టాలి అని ఆయ‌న సూచించారు.

Advertisement
Advertisement