Sabarimala Verdict Review | శబరిమల రివ్యూ పిటిషన్.. సుప్రీంకోర్టులో కొనసాగిన విచారణ
Sabarimala Verdict Review | ఆలయాల్లో మహిళల వివక్ష ఆరోపణలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుప్రీకోర్టు విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ పీఠం ఏర్పాటైన విషయం తెలిసిందే.
Sabarimala Verdict Review | ఆలయాల్లో మహిళల వివక్ష ఆరోపణలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుప్రీకోర్టు విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ పీఠం ఏర్పాటైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ భక్తుడిని భగవంతుడి విగ్రహాన్ని తాకకుండా ఆపితే.. అతనికి హక్కులను రక్షించేందుకు రాజ్యంగం జోక్యం చేసుకోదా? అంటూ ప్రశ్నించారు.
ఆచారాలను అంగీకరించాల్సిందే..
ఆలయ ప్రధానతంత్రి వాదనల ప్రకారం.. పూజా విధానాలు, సంప్రదాయాలు మతంలో అంతర్భాగమన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు దేవుడి స్వరూపాన్ని, ఆచార వ్యవహారాలను అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. శబరిమల కేసుతో పాటు, ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛకు సంబంధించిన పలు అంశాలను కూడా కోర్టు పరిశీలిస్తోంది. ముస్లిం మహిళల మసీదులు, దర్గాల్లో ప్రవేశ హక్కు, పార్సీ మహిళలు అంతర్మత వివాహం తర్వాత మందిరాల్లోకి వెళ్లే హక్కు, బహిష్కరణ పద్ధతుల చట్టబద్ధత, దావూది బోహ్రా సమాజంలో ఖత్నా ఆచారాలపై విచారణ జరుపుతోంది.
గడువులపై కఠిన ఆదేశాలు
ఈ కేసు విచారణ తొలిరోజునే రాజ్యాంగ పీఠం అన్ని పక్షాలు నిర్ణీత గడువుల్లోనే తమ వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇతర కీలక కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నందున అదనపు సమయం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. న్యాయవాదులు తమ వాదనలు, పత్రాలను నిర్ణీత సమయంలోగా సమర్పించాలని ఆదేశించింది. జేసీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఇప్పటికే విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు పునఃపరిశీలన పిటిషన్లకు మద్దతుగా వాదనలకు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకు వ్యతిరేక వాదనలు కొనసాగాయి. మంగళవారం (ఏప్రిల్ 21న) ప్రతివాదనలు, 22న అమికస్ క్యూరీ తుది వాదనలు వినిపించనున్నారు. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సమాజ కేంద్రంగా అర్థం చేసుకోవాలని కోరింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన పిటిషన్లకు మద్దతు ఇస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






