Supreme Court | న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట పాఠం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
Supreme Court | ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన కొత్త ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అంశం చేర్చడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Supreme Court | ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన కొత్త ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అంశం చేర్చడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను ఎవరూ అపఖ్యాతిపాలు చేయడానికి, అవమానించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని విద్యార్థులకు బోధించడం పట్ల న్యాయవాద వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. “ఈ వ్యవస్థకు మేము భాగస్వాములం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తున్నారనే విషయం తెలుసుకుని మేం తీవ్రంగా కలత చెందాం. ఆ పుస్తక ప్రతులు మా వద్ద ఉన్నాయి” అని కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు.
దీనికి స్పందించిన సీజేఐ, ఈ అంశంపై తనకు ఇప్పటికే సమాచారం ఉందని చెప్పారు. పలువురు నుంచి లేఖలు అందాయని, పుస్తకంలోని విషయాలపై కొన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సిబల్ విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే చర్యలు ప్రారంభించామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటుందని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించింది. “సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అధ్యాయంలో తొలిసారిగా న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్ కేసుల భారాన్ని ప్రధాన సమస్యలుగా పేర్కొంది. 2017–2021 మధ్య కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు సుమారు 1,600 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. అలాగే, దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల గణాంకాలను ప్రస్తావించింది. సుప్రీంకోర్టులో సుమారు 81 వేల కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, దిగువ కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. న్యాయమూర్తుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, సంక్లిష్ట విధానాలే ఆలస్యానికి కారణమని పాఠ్యాంశంలో విశ్లేషించింది.
https://x.com/LiveLawIndia/status/2026526594400137436
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






