త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Pawar | అజిత్ ప‌వార్ మ‌ర‌ణం.. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించాలని ఎన్సీపీ నేత డిమాండ్‌

Rohit Pawar | గ‌త‌నెల జ‌రిగిన విమాన ప్ర‌మాదం (Plane Crash)లో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ (Ajit Pawar) మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

D

National | Published On Feb 19, 2026, 1.14 pm IST

Rohit Pawar | అజిత్ ప‌వార్ మ‌ర‌ణం.. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించాలని ఎన్సీపీ నేత డిమాండ్‌
Advertisement

Rohit Pawar | గ‌త‌నెల జ‌రిగిన విమాన ప్ర‌మాదం (Plane Crash)లో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ (Ajit Pawar) మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప్ర‌మాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఎన్సీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్సీపీ నేత, అజిత్ ప‌వార్ మేన‌ల్లుడు రోహిత్ ప‌వార్ (Rohit Pawar) తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప‌వార్ మ‌ర‌ణం వెనుక కుట్ర కోణం దాగి ఉంద‌ని.. విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాలంటే పౌర విమాన‌యాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహ‌న్ నాయుడిని (K Rammohan Naidu) ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు.

ముంబైలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో రోహిత్ ప‌వార్ మాట్లాడుతూ.. "అజిత్ ప‌వార్‌ది ప్ర‌మాదం కాదు.. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన హ‌త్య‌. విమాన‌యాన సంస్థ వీఎస్ఆర్‌ను కాపాడే ప్ర‌య‌త్నం జరుగుతోంది. వీఎస్ఆర్ (VSR Ventures) సంస్థ య‌జ‌మాని వీకే సింగ్‌కు తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న కుమారుడు రోహిత్ సింగ్ వివాహానికి మ‌హారాష్ట్రకు చెందిన కొంద‌రు మాజీ మంత్రులు, ఏపీకి చెందిన టీడీపీ మంత్రులు హాజ‌ర‌య్యారు. అజిత్ ప‌వార్ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో వీఎస్ఆర్ య‌జ‌మానుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ద‌ర్యాప్తు నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాలంటే విచార‌ణ పూర్త‌య్యే వ‌రకూ పౌర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడిని ప‌ద‌వి నుంచి త‌ప్పించాలి. ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగితే న్యాయ‌ప‌రంగా విచార‌ణ జ‌రిగే అవ‌కాశం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రాథ‌మిక విచార‌ణ నివేదిక కూడా రాలేదు. వీఎస్ఆర్ సంస్థ‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి" అని రోహిత్ ప‌వార్ ఆరోపించారు.

ఈ కుట్రలో భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా దాగి ఉందని రోహిత్ ప‌వార్‌ పేర్కొన్నారు. రూ. 35 కోట్ల విలువచేసే విమానానికి రూ.210 కోట్లతో బీమా వెనుక మర్మమేంటి..? అని ప్రశ్నించారు. పైలట్‌ను బ్లాక్‌మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు అని రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. విచారణ పూర్తికాకముందే రోహిత్‌ సింగ్‌ను దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారు..? అంటూ నిల‌దీశారు. బ్లాక్‌ బాక్స్‌ సేఫ్‌గా ఉన్నా పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ రోహిత్‌ పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement