Rohit Pawar | రామ్మోహన్ నాయుడును మంత్రి పదవి నుంచి తొలగించాలి.. ప్రధానికి రోహిత్ పవార్ లేఖ
Rohit Pawar | మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ప్రమాదం కాదని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు అవసరమని ఎన్‌సీపీ-ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Rohit Pawar | మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ప్రమాదం కాదని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు అవసరమని ఎన్‌సీపీ-ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖ కాపీని హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు. ఆయన ఢిల్లీలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జనవరి 28న ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చని రోహిత్ పవార్ ఆరోపించారు. రాజకీయ కుట్రనా? లేకుంటే కమర్షియల్ కుట్రనా? తేల్చడం చాలా ముఖ్యమన్నారు. విమానాన్ని నడిపిన ఎయిర్ చార్టర్ కంపెనీ వీఎస్ఆర్‌పై పలు ప్రశ్నలు లేవనెత్తారు. కంపెనీకి, పౌర విమానయాన మంత్రి పార్టీకి మధ్య ఉన్న సంబంధంపై సంతంత్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కంపెనీ వెనుక శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని, దాంతో దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆరోపించారు. డీజీసీఏ పాత్రపై సైతం నిష్పాక్షిక దర్యాప్తు జరగాలన్నారు.
విమానం బ్లాక్ బాక్స్ గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రమాదం జరిగిన సమయంలో పేలుళ్లు జరిగాయని చెప్పారు. విమానం లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో పెట్రోల్ డబ్బాలు ఉంచడం వల్లే మంటలు చెలరేగాయన్నారు. ఈ అంశాలన్నింటినీ సాంకేతిక, అంతర్జాతీయ సంస్థల సహాయంతో దర్యాప్తు చేయాలన్నారు. ప్రమాదంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే మొదట పౌరవిమానయాన మంత్రి రాజీనామా చేయాలన్నారు. అజిత్ పవార్ దేశానికి, మహారాష్ట్రకు దోహదపడ్డారని, ఆయనకు న్యాయం జరగాలన్నారు. ఇందులోని శక్తుల పాత్రపై దర్యాప్తు జరిగే వరకు నిజాలు బయటపడవన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై ఎన్‌సీపీ, శివసేన యూబీటీ, కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. తాజాగా రోహిత్ పవార్ నేరుగా ప్రధానికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






