త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI Assistant | డిగ్రీ అర్హ‌త‌తో ఆర్బీఐలో 650 అసిస్టెంట్ పోస్టులు.. నెల‌కు రూ.58 వేల‌కుపైగా జీతం

RBI Assistant | భారతీయ రిజర్వు బ్యాంకు అసిస్టెంట్​ (RBI Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 650 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది.

G

National | Published On Feb 19, 2026, 7.02 am IST

RBI Assistant | డిగ్రీ అర్హ‌త‌తో ఆర్బీఐలో 650 అసిస్టెంట్ పోస్టులు.. నెల‌కు రూ.58 వేల‌కుపైగా జీతం
Advertisement

RBI Assistant | త్రినేత్ర‌.న్యూస్‌: భారతీయ రిజర్వు బ్యాంకు అసిస్టెంట్​ (RBI Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 650 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. హైద‌రాబాద్ రీజియ‌న్‌లో 11 ఖాళీలు ఉండ‌గా, అత్య‌ధికంగా ముంబై రీజియ‌న్‌లో 249 ఉన్నాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్​నరీ, మెయిన్స్ పరీక్షల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి మొదటి నెల నుంచే రూ.58 వేలకుపైగా జీతం అందుతుంది.

మొత్తం ఖాళీలు: 650
ఇందులో జ‌న‌ర‌ల్ 346, ఎస్సీ 110, ఎస్టీ 37, ఓబీసీ 99, ఈడ‌బ్ల్యూఎస్ 58 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
హైద‌రాబాద్ రీజియ‌న్‌లో 11 ఖాళీలు (జ‌న‌ర‌ల్ 5, ఎస్సీ 2, ఓబీసీ 3, ఈడ‌బ్ల్యూఎస్ 1, పీడ‌బ్ల్యూడీ 4, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు 1 చొప్పున) ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణుల‌వ్వాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే కేవలం పాసైతేచాలు. అభ్యర్థులు 2026, ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల‌ మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వ‌యోప‌రిమితిలో ఐదేండ్లు, బీసీల‌కు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ద్వారా
మొద‌ట ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ పాస‌వ్వాలి. అనంత‌రం మెయిన్స్ ఉంటుంది. అందులో అర్హ‌త సాధించిన‌వారిని లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ టెస్ట్‌కు (LPT) పిలుస్తారు. ప్రిలిమ్​నరీ, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్​ మీడియంలో ఉంటుంది. హైదరాబాద్​ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలుగులోనూ పరీక్ష రాయ‌వ‌చ్చు.

ప్రిలిమిన‌రీ

ప్రాథమిక పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఇంగ్లిష్ (30 ప్రశ్నలు), రెండో విభాగం న్యూమరికల్ ఎబిలిటీ (35 ప్రశ్నలు), రీజనింగ్​ ఎబిలిటీ (35 ప్రశ్నలు) అడుగుతారు. గంట వ్యవధిలో ప‌రీక్ష‌ను పూర్తిచేయాలి. ఒక్కో విభాగానికి 20 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాదానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మెరిట్​, రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్స్..

ఇందులో 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 5 విభాగాలు (ఇంగ్లిష్​, రీజనింగ్, న్యూమరికల్​ ఎబిలిటీ, జనరల్​ అవేర్​నెస్, కంప్యూటర్​ నాలెడ్జ్​) ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్​ నాలెడ్జ్​కు 20 నిమిషాలు, జనరల్​ ఎవేర్​నెస్​కు 25 నిమిషాలు, మిగిలిన మూడు విభాగాలకు 30 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. ప‌రీక్ష‌ను 135 నిమిషాల్లో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాదానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్​ ఆధారంగా విభాగాల వారీగా ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున లాంగ్వేజ్​ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు.

లాంగ్వేజ్​ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు భాషా నైపుణ్యం పై పరీక్ష నిర్వహిస్తారు. దీనికోసం దరఖాస్తు చేసుకున్న ప్రాంతానికి సంబంధించిన భాషలో ఈ పరీక్ష ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ల‌కు చివరి తేదీ: మార్చి 8
దరఖాస్తు ఫీజు: రూ.450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​ సర్వీస్​మెన్ అభ్యర్థులకు రూ.50 (జీఎస్టీ అదనం)
ప్రిలిమినరీ పరీక్ష: ఏప్రిల్ 11 నుంచి
మెయిన్స్: జూన్​ 7 నుంచి
వెబ్​సైట్: https://www.rbi.org.in/

 

Advertisement

తాజావార్తలు

Advertisement