త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIA | ఎన్ఐఏ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా రాకేశ్ అగ‌ర్వాల్‌

NIA | జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (NIA) నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ (DG)గా సీనియ‌ర్ ఐపీఎస్ (IPS) అధికారి రాకేశ్ అగ‌ర్వాల్ (Rakesh Agarwal) నియ‌మితుల‌య్యారు. ఐటీబీపీ (ITBP) నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా శ‌తృజీత్‌సింగ్‌, బీఎస్ఎఫ్ (BSF) డీజీగా ప్ర‌వీణ్ కుమార్‌ లను నియ‌మించారు.

A

National | Published On Jan 15, 2026, 6.34 pm IST

NIA | ఎన్ఐఏ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా రాకేశ్ అగ‌ర్వాల్‌
Advertisement

NIA | జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (NIA) నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ (DG)గా సీనియ‌ర్ ఐపీఎస్ (IPS) అధికారి రాకేశ్ అగ‌ర్వాల్ (Rakesh Agarwal) నియ‌మితుల‌య్యారు. ఐటీబీపీ (ITBP) నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా శ‌తృజీత్‌సింగ్‌, ప్ర‌స్తుతం ఐటీబీపీ డీజీగా ప‌నిచేస్తున్న ప్ర‌వీణ్ కుమార్‌ను బీఎస్ఎఫ్ (BSF) డీజీగా నియ‌మించారు. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నియామ‌కాల క‌మిటీ ఆఫ్ ది కేబినెట్ నియామ‌కాల‌ను ఆమోదించింది. ఆయ‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కేడ‌ర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్ర‌స్తుతం ఆయ‌న ఎన్ఐఏ స్పెష‌ల్ డీజీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఎన్ఐఏ డీజీ ప‌ద‌విలో ఆయ‌న 2028 ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు.
ఇటీవ‌లి వ‌ర‌కు ఎన్ఐఏ డీజీగా ప‌నిచేసిన స‌దానంద్ వ‌సంత్‌ను మ‌హారాష్ట్ర కేడ‌ర్‌కు తిరిగి పంప‌డంతో ఈ నియామ‌కం చేప‌ట్టారు. సుదీర్ఘ‌కాలం ఎన్ఐఏతో అనుబంధం ఉన్న అగ‌ర్వాల్ వివిధ క్లిష్ట‌మైన కేసులను చేదించిన ఘ‌న‌త సాధించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement