త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | మేడారం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ (Sammakka saralamma) జాత‌ర స‌మీపిస్తున్న వేళ ఆల‌య ప్రాంగ‌ణాన్ని సుంద‌రీక‌రించాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారుల‌ను ఆదేశించారు. 

A

Telangana | Published On Jan 15, 2026, 7.17 pm IST

Ponguleti Srinivas Reddy | సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి
Advertisement

ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని దిశానిర్దేశం
మంత్రులు సీత‌క్క‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ల‌తో క‌లిసి ఆక‌స్మిక త‌నిఖీ

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మేడారం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ (Sammakka saralamma) జాత‌ర స‌మీపిస్తున్న వేళ ఆల‌య ప్రాంగ‌ణాన్ని సుంద‌రీక‌రించాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రోడ్లు పారిశుద్ధ్యం, ల్యాండ్ స్కేపింగ్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మేడారం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌న్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మేడారం జాత‌ర ప‌నుల పురోగ‌తిపై మంత్రులు ధ‌న‌స‌రి సీత‌క్క‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ల‌తో క‌లిసి ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హించారు. ఆల‌య ప్రాంగ‌ణంలోని ల్యాండ్ స్కేపింగ్ ప‌నులు, ప్ర‌ధాన ద్వారం ఫ్లోరింగ్, మీడియా ట‌వ‌ర్‌, క్యూలైన్స్ షేడ్స్‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం జిల్లా అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు. పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని సూచించారు. ఆలయ ప్రాంగణా పరిసరాలలో మిగిలిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అధికారులకు చెప్పారు. డివైడర్‌ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్‌ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణ రాతి స్తంభాలకు పచ్చదనంగా వివిధ రకాల పూలతో సుందరీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. మేడారం జాతర రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ దివాక‌ర టీఎస్‌, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేక‌న్‌, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ‌, అద‌న‌పు ఎస్పీ మ‌న‌న్ భ‌ట్‌, అద‌న‌పు క‌లెక్ట‌ర్ సంప‌త్‌రావు, ఆర్‌డీవో వెంక‌టేశ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement