Gade Innaiah | హైదరాబాద్ : సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఇన్నయ్యను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడని గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన NIA అధికారులు ఆయన్ను ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు (Maoist) నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనపై యూఏపీఏ (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల మావోయిస్టులకు అనుకూలంగా... ఇటీవలి కాలంలో మావోయిస్టులకు అనుకూలంగా గాదె ఇన్నయ్య మీడియాలో మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా (Hidma) సొంతూరు పువర్తికి మీడియాతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇన్నయ్య ఇంటిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.