Sumitra Balmik | తల్లిదండ్రులను చూసుకునేందుకు ఉద్యోగులకు 45 రోజులు సెలవులు ఇవ్వాలి : ఎంపీ
Sumitra Balmik | 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులను చూసుకునేందుకు (take care of their parents) ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 45 రోజులు సెలవులు ఇవ్వాలని (45 day leave for Employees) ఎంపీ సుమిత్రా వాల్మీకి (Sumitra Balmik) ప్రతిపాదించారు.
Sumitra Balmik | ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ సుమిత్రా వాల్మీకి (Sumitra Balmik) రాజ్యసభలో కీలక ప్రతిపాదన చేశారు. 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులను చూసుకునేందుకు (take care of their parents) ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 45 రోజులు సెలవులు ఇవ్వాలని (45 day leave for Employees) ప్రతిపాదించారు. రాజ్యసభలో జీరో అవర్‌లో (Zero Hour in the Rajya Sabha) మాట్లాడిన ఎంపీ ఈ సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు.
"మహిళలు, యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పుడు నేను మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 14 కోట్లు దాటింది. 2036 నాటికి ఆ సంఖ్య 23 కోట్లు దాటుతుంది. అంటే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఓ వృద్ధుడు ఉంటారు. అయితే, ఉపాధి అవకాశాల కోసం కోట్లాది మంది యువకులు తమ ఇళ్లను వదిలి దూరంగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల తల్లిదండ్రులు ఒంటరివారవుతున్నారు.
వారికి వైద్య సంరక్షణ అవసరమైనప్పుడు పిల్లలు దగ్గర ఉండటం చాలా ముఖ్యం. కానీ పని ఒత్తిడితో యువత తమ తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నారు. ఆఫీసు నుంచి సెలవు తీసుకోవడం వారికి ఇబ్బందిగా మారుతోంది. అందుకే 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులను చూసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి 45 రోజులు సెలవు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓ తల్లి తన బిడ్డ కోసం 20 ఏళ్ల సమయం ఎలా కేటియిస్తోంది.. అదేవిధంగా వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసుకునేందుకు కూడా పిల్లలు సమయం కేటాయించాలి" అని ఆమె ప్రభుత్వానికి విన్నవించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Parliament Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా
ఏప్రిల్ 18, 2026

Harivansh Narayan Singh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
ఏప్రిల్ 17, 2026

Rajya Sabha | రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ప్రమాణం
ఏప్రిల్ 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



