త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఇక రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు బోర్డింగ్‌ స్టేషన్‌ మార్చుకోవచ్చు..!

P

National | Published On Feb 20, 2026, 7.06 pm IST

Indian Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఇక రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు బోర్డింగ్‌ స్టేషన్‌ మార్చుకోవచ్చు..!
Advertisement

Indian Railway | భారతీయ రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నది. రైల్వే బోర్డ్‌ బోర్డింగ్‌ స్టేషన్స్‌కు సంబంధించిన రూల్స్‌ను సవరించేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. రైల్వేచార్ట్‌ తయారీకి ముందే ప్రయాణీకులు తమ బోర్డింగ్‌ స్టేషన్‌ని మార్చుకునే వెలుసుబాటు కల్పించబోతున్నది. ఈ మేరకు డైరెక్టర్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)కి రైల్వేబోర్డు (ప్యాసింజర్ మార్కెటింగ్-2) మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రయాణీకులు తమ టికెట్లు బుక్‌ చేసుకున్న తర్వాత పలుసార్లు ప్రయాణాల్లో మార్పులు చేసుకుంటుంటారు. ప్రస్తుతం ఉన్న రూల్స్‌ ప్రకారం.. బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది. కొత్త ప్రతిపాదనలతో ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఓ ప్రయాణీకుడు ఒక స్టేషన్‌ నుంచి బుక్‌ చేసుకున్న తర్వాత.. అదే రూట్‌లో మరో స్టేషన్‌లో రైలు ఎక్కాలని భావిస్తే.. రిజర్వేషన్‌ చార్ట్‌ ప్రిపేర్‌ కావడానికి ముందు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కలుగనుంది. ప్రస్తుతం ప్రక్రియలో రిజర్వేషన్‌ చార్ట్‌ తయారీ సమయం సాధారణంగా ట్రైన్‌ బయలుదేరడానికి 10-20 గంటల ముందు మొదలవుతుంది. ప్రయాణిలకు మెరుగైన సౌకర్యం కల్పించే ఉద్దేశంతో రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది.

కొత్త విధానంలో అమలులోకి వస్తే.. సాధారణ ట్రైన్‌ ప్రయాణికులు రిజర్వేషన్‌ చార్ట్‌ తయారయ్యే వరకు సుమారు 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకునే వీలుంటుంది. అయితే, వందే భారత్‌ వంటి ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బోర్డింగ్‌ స్టేషన్‌ మార్చుకునే సౌకర్యం రైలుబయలుదేరే, చార్ట్‌ తయారయ్యే 15 నిమిషాల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త డిజిటల్ విధానం అమలులోకి వస్తే అకస్మాత్తుగా బోర్డింగ్‌ మార్చుకోవాల్సిన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో బెర్తులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

ఈ విధానం అమలయితే వేలాది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. తమ టికెట్లను రద్దు చేయాల్సిన అవసరం లేకుండా.. అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమకు అనుకూలమైన బోర్డింగ్ స్టేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. సీఆర్‌ఐఎస్‌ని ఈ విధానాన్ని పరిశీలించాలని చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేసి ఇస్తే.. బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా అమలులోకి వస్తుంది. రైల్వే బోర్డు లేఖలో 2019 రైల్‌వే కమర్షియల్ సర్క్యులర్ నం.17ని ఉదహరించింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. ఒక స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసిన ప్రయాణికుడు అదే రూట్‌లోని వేరే స్టేషన్ నుంచి బోర్డింగ్ కావాలనుకుంటే.. బోర్డింగ్ స్టేషన్ మార్చే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
Advertisement