Railway Rules | రైలులో నెయ్యిని తీసుకెళ్తున్నారా..? మరీ ఈ రూల్స్ తెలుసా..?
Railway Rules | భారతీయ రైల్వేలు నిత్యం లక్షలాది మంది ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణీకులకు రైల్వే నిబంధనలు అమలు చేస్తుంది. టికెట్ నుంచి సరుకు రవాణా వరకు ఎన్నో రూల్స్ అమలు చేస్తుంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రూల్స్‌ను తీసుకువచ్చింది.
Railway Rules | భారతీయ రైల్వేలు నిత్యం లక్షలాది మంది ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణీకులకు రైల్వే నిబంధనలు అమలు చేస్తుంది. టికెట్ నుంచి సరుకు రవాణా వరకు ఎన్నో రూల్స్ అమలు చేస్తుంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రూల్స్‌ను తీసుకువచ్చింది. ప్రయాణం సమయంలో అందరికీ ఈ రూల్స్‌పై అవగాహన ఉండాలి. లేకపోతే ఏ చిన్న పొరపాటు చేసినా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వేలు ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. వారంతా తమ వెంట వివిధ వస్తువులను కూడా తీసుకెళ్తారు. అయితే, కొన్ని వస్తువుల విషయంలో షరతులు విధించింది.
గరిష్టంగా 20 కిలోలు మాత్రమే..
వాటిలో ఒకటి నెయ్యి గురించి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అవును చదివేందుకు మీకు వింతగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు ఇలాంటి ఓ నిబంధన ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చు. మీరు చదివేది అక్షరాలా నిజం. నెయ్యి రవాణా విషయంలోనూ రైల్వే పరిమితులు విధించింది. మీరు నెయ్యిని రైలులో తీసుకెళ్లాలంటే, గరిష్టంగా 20 కిలోలకు మాత్రమే అనుమతి ఉంది. నెయ్యి తప్పనిసరిగా సీల్డ్ టిన్ బాక్స్‌లో ఉండాలి. లీక్ అయ్యే అవకాశంతో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లలో నెయ్యిని తీసుకెళ్లడం సంపూర్ణంగా నిషిద్ధం. ఎందుకంటే రైలులో నెయ్యి లీక్ అయితే ప్రయాణీకులు జారిపడిపోవడం, గాయాలకు గురయ్యే వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే, అగ్ని ప్రమాదాలకు సైతం అవకాశం ఉంటుంది.
అనుమతి తప్పనిసరి..
20 కిలోలకు మించి రైలులో నెయ్యిని తీసుకు వెళ్లాలంటే తప్పనిసరిగా రైల్వే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రైలులో తనిఖీలు చేసిన సమయంలో జరిమానా విధించడంతో పాటు నెయ్యిని సైతం స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం సమయంలో రైల్వే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెయ్యిని తీసుకువెళ్లే సమయంలో ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా జరిగేలా సరిగ్గా ప్యాక్ చేసిన సీల్డ్ డబ్బాల్లో మాత్రమే తీసుకెళ్లడం మంచిదని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






