Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
Rahul Gandhi | దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే నెలల తరబడి, ఏళ్లపాటు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Rahul Gandhi | దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే నెలల తరబడి, ఏళ్లపాటు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తమ నిరసనల్లో వేర్వేరు అంశాలేవీ లేవని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే ఉమ్మడి లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడిందని, ఎన్నికల వ్యవస్థ దెబ్బతిన్నదని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనను తిరిగి తీసుకురావడానికి విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయని వెల్లడించారు.
పోరాటం ఆపే ప్రసక్తే లేదు
ప్రజాస్వామ్య భావాలను వ్యక్తపరిచేందుకు నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం, తమ గొంతును వినిపించేందుకు పోరాడకుండా ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ పోరాటం తక్షణమే ఫలితాన్నివ్వకపోయినా లక్ష్యాన్ని చేరుకునే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి, న్యాయవ్యవస్థపై తమకు అపారమైన గౌరవం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు మార్గం చూపడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో, న్యాయపరమైన పరిణామాలతో సంబంధం లేకుండా తమ రాజకీయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
దేశంలో ఎన్నికల వ్యవస్థకు నష్టం కలిగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘానికి చెందిన జ్ఞానేశ్ కుమార్, మరో మహిళా అధికారిపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటున్న వారిపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. తమ పోరాటంలో పట్టుదలే కీలకమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లక్ష్య సాధనకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని, అయితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది లేదా రెండేళ్లు పట్టినా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో అనుసరించే కార్యాచరణను ఇప్పుడే వెల్లడించలేమని, తమ ఉద్యమం అంతిమంగా విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
- ●FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?
- ●Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?

FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?

Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్

School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం





