త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | బీజేపీలో చేరిన రాఘ‌వ్ చ‌ద్దా.. భారీగా త‌గ్గిన ఫాలోవ‌ర్స్‌..!

Raghav Chadha | రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీలో చేర‌డం న‌చ్చ‌ని ప‌లువురు నెటిజ‌న్స్ ఆయ‌న‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. ఒక్క రోజులోనే మిలియ‌న్‌కు పైగా ఫాలోవ‌ర్స్ త‌గ్గ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

P

National | Published On Apr 25, 2026, 4.49 pm IST

Raghav Chadha | బీజేపీలో చేరిన రాఘ‌వ్ చ‌ద్దా.. భారీగా త‌గ్గిన ఫాలోవ‌ర్స్‌..!
Advertisement

Raghav Chadha | రాజ్య‌స‌భ సభ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి ఆయ‌న బీజేపీలో చేరారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ఆరుగురు స‌భ్యు సైతం కాషాయ పార్టీలో చేరారు. మిగ‌తా నేత‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు పార్టీ నాయ‌క‌త్వం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి రాఘ‌వ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌క‌త్వం తొల‌గించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ పార్టీలో రాఘ‌వ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌తో విభేదాలు ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. గ‌త కొంత‌కాలంగా రాజ్య‌స‌భ‌లో ప‌లు కీల‌క ప్ర‌శ‌లు అడిగిన దేశ‌వ్యాప్తంగా వార్త‌లో వ్య‌క్తిగా నిలిచారు. తాజాగా ఆయ‌న బీజేపీలో చేర‌డంతో సోష‌ల్ మీడియాలో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ప‌లువురు ఆయ‌న‌ను కొంద‌రు దీన్ని అవ‌కాశ‌వాద రాజ‌కీయంగా విమ‌ర్శించ‌గా.. మ‌రికొంద‌రు కొత్త రాజ‌కీయ అధ్యాయానికి నాంది ప‌లుకుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మిలియ‌న్‌కుపైగా అన్‌ఫాలో..

ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో రాఘ‌వ్‌కు షాక్ త‌గిలింది. 24గంట‌ల్లోనే ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ ల‌క్ష‌ల్లో త‌గ్గిపోయిన‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం 14.6 మిలియ‌న్లుగా ఉన్న ఫాలోవ‌ర్లు శ‌నివారం మ‌ధ్యాహ్నానికి 13.5 మిలియ‌న్ల‌కు ప‌డిపోయిన‌ట్లుగా గ‌ణాంకాలు సూచిస్తున్నాయి. ఈ విష‌యంపై ఈ విషయంపై అనిష్ గవాండే స్పందిస్తూ.. జెన్ జీ అన్‌ఫాలో క్యాంపెయిన్ కార‌ణంగా ఫాలోవ‌ర్స్ త‌గ్గుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇంట‌ర్నెట్ ఒక్క రాత్రిలో హీరోను జీరోగా మార్చ‌గ‌ల‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి రాఘ‌వ్ చ‌ద్దాకు యువ‌త‌లో మంచి గుర్తింపు ఉన్న‌ది.

రాజ్య‌స‌భ‌లో స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తి..

రాజ్య‌స‌భ‌లో పితృత్వ సెల‌వులు, సమస్యలు, టెలికాం ప్లాన్స్‌, ఎయిర్‌పోర్టుల్లో అధిక ధరలు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. గిగ్ వర్కర్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒకరోజు డెలివరీ బాయ్‌గా ప‌ని చేయ‌డం సైతం చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ చ‌ర్య‌ల‌తో సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకున్న నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు వ‌చ్చింది. తాజాగా ఆయ‌న బీజేపీ పార్టీలో చేర‌డంతో ఇక‌పై అదే స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతారా? లేదంటే మిన్న‌కుండిపోతారా? అన్న చ‌ర్చ సాగుతోంది.

Advertisement
Advertisement