త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP Leader Shot Dead | ఆప్‌నేత దారుణ హ‌త్య‌.. కారులో ఉండ‌గా కాల్పులు

AAP Leader Shot Dead | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత (AAP Leader) ల‌క్కీ ఒబెరాయ్ (Lucky Oberoi) దారుణ హ‌త్యకు గుర‌య్యాడు.

D

National | Published On Feb 6, 2026, 10.21 am IST

AAP Leader Shot Dead | ఆప్‌నేత దారుణ హ‌త్య‌.. కారులో ఉండ‌గా కాల్పులు
Advertisement

AAP Leader Shot Dead | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత (AAP Leader) ల‌క్కీ ఒబెరాయ్ (Lucky Oberoi) దారుణ హ‌త్యకు గుర‌య్యాడు. పంజాబ్ (Punjab)లోని జ‌లంధ‌ర్ (Jalandhar)లోగ‌ల గురుద్వారా వెలుప‌ల ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌డిపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ల‌క్కీ ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోడ‌ల్ టౌన్‌లోని గురుద్వారాకు ల‌క్కీ ఒబెరాయ్ రోజూ వెళ్తుంటాడు. ఇవాళ ఉద‌యం కూడా ఆయ‌న త‌న థార్ కారులో గురుద్వారా వ‌ద్ద‌కు చేరుకున్నాడు. కారును పార్క్ చేస్తుండ‌గా.. బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు అత‌డిపై తుపాకీతో కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ల‌క్కీకి ఐదు బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డిని స్థానికులు వెంట‌నే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, గాయాల‌ తీవ్ర‌త కార‌ణంగా అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. దాడికి పాల్ప‌డిన వారిని ప‌ట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Advertisement
Advertisement