Pulwama Attack | పుల్వామా దాడికి ఏడేళ్లు.. వీర జవాన్లకు నేతల నివాళులు
Pulwama Attack | జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి (Pulwama Attack)కి నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తైంది.
Pulwama Attack | జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి (Pulwama Attack)కి నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా అమరవీరులకు (tribute to fallen soldiers) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వీర సైనికుల త్యాగాన్ని మర్చిపోం..
2019లో పుల్వామా దాడిలో దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరిచిపోదు. వీరుల ధైర్యం, దేశభక్తి.. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తోంది. వారి సేవ, సంకల్పం, దేశభక్తి ఎప్పటికీ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి అని ప్రధాని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
https://x.com/narendramodi/status/2022506173191327876
అంతకుముందు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కూడా అమరజవాన్లకు నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం నివాళులర్పించారు. భారత్‌కు ఉగ్రవాదం కలిగిస్తోన్న తీవ్రమైన ముప్పును వారి త్యాగం ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. మాతృభూమి సార్వభౌమత్వం, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాలను చూసి భారత్ ఎప్పుడూ గర్వపడుతోందన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
https://x.com/VPIndia/status/2022484334268289187
పుల్వామా దాడి..
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ (Balakot Air Strike) చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gutta Sukhendar Reddy | చిన్నారెడ్డి చేసింది తప్పు.. కొండా సురేఖను తప్పిస్తేనే బెటర్
- ●Ather Konarc | రూ.99,999కే ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 200 కి.మీ రేంజ్..
- ●RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘటన జరిగితే మేడిపల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాదవ్ ఏం పాపం చేసిండు?
- ●Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
- ●Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో మరోసారి అంతరాయం
- ●Yellamma Movie | ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది - దేవీశ్రీప్రసాద్‌కు జోడీగా మ్యాడ్ బ్యూటీ!

Gutta Sukhendar Reddy | చిన్నారెడ్డి చేసింది తప్పు.. కొండా సురేఖను తప్పిస్తేనే బెటర్

Ather Konarc | రూ.99,999కే ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 200 కి.మీ రేంజ్..

RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘటన జరిగితే మేడిపల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాదవ్ ఏం పాపం చేసిండు?

Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్






