త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Notice | రూ.2 కోట్లు ట్యాక్స్ చెల్లించండి.. రూ.6 వేలు సంపాదించే ప్రైవేట్ టీచ‌ర్‌కు జీఎస్టీ నోటీసులు

IT Notice | కూలీలు, నెల‌కు స‌రిగ్గా రూ.10 వేలు కూడా సంపాదించ‌నివారికి కోట్ల‌లో ప‌న్నులు క‌ట్టాలంటూ ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు (IT Notice) జారీ చేస్తున్న వార్త‌లు త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. పాన్‌కార్డ్ దుర్వినియోగంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి నోటీసే ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిని (Private School Teacher) ఆందోళ‌న‌కు గురిచేశాయి.

G

National | Published On Feb 21, 2026, 11.16 am IST

IT Notice | రూ.2 కోట్లు ట్యాక్స్ చెల్లించండి.. రూ.6 వేలు సంపాదించే ప్రైవేట్ టీచ‌ర్‌కు జీఎస్టీ నోటీసులు
Advertisement

IT Notice | త్రినేత్ర‌.న్యూస్‌: కూలీలు, నెల‌కు స‌రిగ్గా రూ.10 వేలు కూడా సంపాదించ‌నివారికి కోట్ల‌లో ప‌న్నులు క‌ట్టాలంటూ ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు (IT Notice) జారీ చేస్తున్న వార్త‌లు త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. పాన్‌కార్డ్ దుర్వినియోగంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి నోటీసే ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిని (Private School Teacher) ఆందోళ‌న‌కు గురిచేశాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా భార్వతియా ముస్తాఖం గ్రామానికి చెందిన ఓం ప్ర‌కాశ్ వ‌ర్మ.. ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. ఆయ‌న జీతం నెల‌కు రూ.6 వేలు. అయితే రూ.2 కోట్ల పన్ను చెల్లించాలంటూ జీఎస్టీ శాఖ (GST) అత‌నికి నోటీసు (Tax Notice) జారీ చేసింది. జ‌న‌వ‌రి 31న‌ రూ.1,99,42,313 పన్ను చెల్లించాల‌ని నోటీసు రాగా అత‌డు ప‌ట్టించుకోలేదు. అయితే ఈ నెల 10న కూడా మ‌రోసారి నోటీసులు రావ‌డంతో ఆశ్చ‌ర్యంతోపాటు ఆందోళ‌న‌కు గురైన ప్ర‌శాక్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

ద‌ర్యాప్తులో భాగంగా ఓం ప్రకాష్ పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశార‌ని తేలింది. అత‌ని పేరుతో న్యూఢిల్లీలో ఓ ట్రేట‌ర్స్‌, ఫరూఖాబాద్‌లో వ‌ర్మా ఎంట‌ర్‌ప్రైజెస్ అనే సంస్థలను సృష్టించారని గుర్తించారు. ఢిల్లీలోని ఓం ట్రేడర్స్ గతేడాది మొత్తం రూ.11,07,90,628 లావాదేవీలు నిర్వ‌హించ‌డంతో.. దానికిగాను రూ.1,99,42,313 పన్నులు క‌ట్టాలంటూ ఓం ప్ర‌కాశ్‌కు నోటీసు అందింది.

ఈ నేప‌థ్యంలో నా పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి రెండు సంస్థలను సృష్టించార‌ని ఓం ప్ర‌కాశ్ వాపోయారు. త‌నకు ఫిబ్రవరి 10న నోటీసు అందింద‌ని, అందులో రూ.2 కోట్లు చెల్లించాలని ఉంద‌ని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించాన‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement