త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Charter Plane Crash | గాల్లో ఉండ‌గా సాంకేతిక స‌మ‌స్య‌.. కుప్ప‌కూలిన ట్రైనీ విమానం..

Charter Plane Crash | క‌ర్నాట‌క విజ‌య‌పుర జిల్లాలో రెడ్‌బ‌ర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ ట్రైనీ చార్ట‌ర్ విమానం కుప్ప‌కూలింది. బబలేశ్వర్ తాలూకాలోని మంగళూరు గ్రామంలో ఈ సంఘటన జ‌రిగింది. కెప్టెన్‌, ట్రైనీ పైల‌ట్‌తో కూడిన ఈ తేలిక‌పాటి విమానంలో క‌ల‌బురిగి నుంచి బెల‌గావికి వెళ్తున్న స‌మ‌యంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం త‌లెత్తింది.

P

National | Published On Feb 8, 2026, 6.19 pm IST

Charter Plane Crash | గాల్లో ఉండ‌గా సాంకేతిక స‌మ‌స్య‌.. కుప్ప‌కూలిన ట్రైనీ విమానం..
Advertisement

Charter Plane Crash | క‌ర్నాట‌క విజ‌య‌పుర జిల్లాలో రెడ్‌బ‌ర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ ట్రైనీ చార్ట‌ర్ విమానం కుప్ప‌కూలింది. బబలేశ్వర్ తాలూకాలోని మంగళూరు గ్రామంలో ఈ సంఘటన జ‌రిగింది. కెప్టెన్‌, ట్రైనీ పైల‌ట్‌తో కూడిన ఈ తేలిక‌పాటి విమానంలో క‌ల‌బురిగి నుంచి బెల‌గావికి వెళ్తున్న స‌మ‌యంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం త‌లెత్తింది. గాల్లోనే స‌మ‌స్య‌ను స‌రిచేసేందుకు య‌త్నించారు. వారి ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.

దాంతో పొలాల్లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో విమానం బ‌లంగా నేల‌ను తాకింది. దాంతో ఒక్క‌సారిగా విమానం రెండు ముక్క‌లైంది. ఈ స‌మ‌యంలో పెద్ద ఎత్తున దుమ్మూధూళి, శ‌క‌లాలు ఎగిరిప‌డ్డాయి. విమానం కింద‌ప‌డుతున్న స‌మ‌యంలోనే కెప్టెన్‌, ట్రైనీ పైల‌ట్ ఇద్ద‌రు బ‌య‌ట‌ప‌డ‌డంతో స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. స్థానికులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయం అందించారు. కెప్టెన్‌, పైల‌ట్‌ను అంబులెన్స్‌లో విజ‌య‌పుర ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని రెడ్‌బర్డ్ ఏవియేషన్‌లో అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ (AFI) కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పైలట్ గౌతమ్ శంకర్‌గా గుర్తించారు.

ఆ త‌ర్వాత స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. చెల్లాచెదురుగా ప‌డిన శిథిలాల‌ను స్వాధీనం చేసుకొని ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రెడ్‌బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ విమానం కూలిపోయింద‌ని.. క‌ల‌బురగి నుంచి బెలగావికి వెళుతుండ‌గా ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి అకస్మాత్తుగా కూలిపోయింద‌ని తెలిపారు. ప్ర‌మాదంలో కెప్టెన్‌, ట్రైనీ పైల‌ట్‌కు తీవ్రంగానే గాయాల‌య్యాయని, చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement