Sunitha Laxma Reddy | రాష్ట్రంలో కొనసాగుతున్న దుశ్శాసన పర్వం.. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీతా లక్ష్మారెడ్డి
Sunitha Laxma Reddy | మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా అని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని మండిపడ్డారు.
Sunitha Laxma Reddy | త్రినేత్ర.న్యూస్: మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా అని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని మండిపడ్డారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాటమే తాము చేసిన పాపమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ షర్ట్ ధరించి వెళ్లడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటువద్దే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చీరపట్టుకుని లాగారని, తనను అవమానించారంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ఘటన అని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోవా లక్ష్మి పట్టుకోకుండా ఉంటే తనాఉ గ్రిల్స్‌పై పడిపోయేదానినని చెప్పారు. కేటీఆర్, హరీశ్ రావు లేకుంటే తమను కిందపడేసి తొక్కేసేవాళ్లన్నారు. ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా ప్రవర్తించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. తాము ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర మహిళలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?.. సబితారెడ్డి ఆగ్రహం
మహిళా సభ్యులతో ఇలాగేనా ప్రవర్తించేందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నల్లబట్టలతో అసెంబ్లీకి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్లమెంటుకు నల్ల దుస్తుల్లో వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తే తప్పులేదా అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేశారా? అని నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగేసి కిందపడేసే ప్రయత్నం చేశారన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇది తమకు జరిగిన అవమానం కాదని.. మహిళా సమాజానికి జరిగిన అవమానమన్నారు. అసెంబ్లీ ముందు జరిగిన ఘటన హేయమైందన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్?
సెప్టెంబర్ 7, 2026

BRS Protest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
సెప్టెంబర్ 7, 2026

Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Vakiti Srihari | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను తగవు : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Harish Rao | మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్?
- ●BRS Protest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
- ●Minister Seethakka | ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్‌డ్రా చేస్తే నష్టమా..?
- ●Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు

Vakiti Srihari | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను తగవు : మంత్రి వాకిటి శ్రీహరి

Harish Rao | మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతారా?.. ఇదేం రాజ్యం రేవంత్?

BRS Protest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

Minister Seethakka | ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క



