త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను త‌గ‌వు : మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

P

Telangana | Published On Sep 7, 2026, 1.11 pm IST

Vakiti Srihari | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను త‌గ‌వు : మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Vakiti Srihari | తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. శాసనసభ స్పీకర్‌ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని, అది మొత్తం శాసనసభకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. అలాంటి అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిపై వ్యక్తిగత, అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ‘స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని సూచించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావివ్వకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో సభా సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలు, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇకనైనా ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement