Seva Teerth | PMO అడ్రెస్ మారింది.. సేవా తీర్థ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Seva Teerth | దేశ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) అడ్రెస్ మారింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం 'సేవా తీర్థ్' (Seva Teerth)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించారు.
Seva Teerth | దేశ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) అడ్రెస్ మారింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం 'సేవా తీర్థ్' (Seva Teerth)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించారు. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి విధులు నిర్వహిస్తుండగా.. ఇక నేటి నుంచి ఈ కొత్త భవనం నుంచే ప్రధాని కార్యకలాపాలను సాగించనున్నారు. కర్తవ్యభవన్ 1, 2లను కూడా ప్రధాని ప్రారంభించారు.
కాగా, గతంలో ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్ భవనాలు వేర్వేరు చోట్ల ఉండేవి. ఆ ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు వాటిని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
సెంట్రల్ విస్టా (Central Vista) అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి మార్చారు. ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్-1లో ఒక భవనాన్ని సేవాతీర్థ్-1గా పిలవనున్నారు. దానిలో పీఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు భవనాలు సేవాతీర్థ్-2, సేవాతీర్థ్-3గా ఏర్పాటు చేశారు. సేవా తీర్థ్-2 నుంచి జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం, సేవాతీర్థ్-3 నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్ పనిచేయనుంది. కర్తవ్యభవన్ 1, 2లోకి న్యాయ, రక్షణ, ఆర్థిక, వైద్యారోగ్యం, వ్యవసాయం వంటి కీలక మంత్రిత్వ శాఖలను తరలించనున్నారు. ఈ భవనాలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






