త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన ఆర్థిక‌మంత్రి.. నోరు తీపి చేసిన ద్రౌప‌ది ముర్ము

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మ‌రికొద్దిసేప‌ట్లో పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆమె రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి బ‌డ్జెట్ ప్ర‌తిని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రికి రాష్ట్ర‌ప‌తి పెరుగు-చెక్క‌ర‌ను తినిపించారు.

P

National | Published On Feb 1, 2026, 10.10 am IST

Union Budget 2026 | రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన ఆర్థిక‌మంత్రి.. నోరు తీపి చేసిన ద్రౌప‌ది ముర్ము
Advertisement

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మ‌రికొద్దిసేప‌ట్లో పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆమె రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి బ‌డ్జెట్ ప్ర‌తిని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రికి రాష్ట్ర‌ప‌తి పెరుగు-చెక్క‌ర‌ను తినిపించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వ‌స్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బయలుదేరే ముందు ఆర్థిక మంత్రికి రాష్ట్ర‌ప‌తి 'దహీ-చీనీ' (పెరుగు-చక్కెర) తినిపిస్తారు. అనంత‌రం ఆమె పార్ల‌మెంట్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. నిర్మ‌లా సీతారామ‌న్ వెంట ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు ఆర్థిక మంత్రి ఉన్నారు.

తొమ్మిదో సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నిర్మ‌ల సీతారామన్ వరుసగా తన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం రికార్డును సమం చేయ‌డంతో పాటు ప్రణబ్ ముఖర్జీ రికార్డును అధిగమించనున్నారు. స్వతంత్ర భార‌తంలో అత్యధిక సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రికార్డు మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న‌ది. ఆయ‌న పది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆరు, 1967-1969 మధ్య మరో నాలుగు బడ్జెట్లు ఉన్నాయి. రెండో స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఉన్నారు. ఆయన తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తాజాగా నిర్మలా సీతారామన్ ఆ రికార్డును సమం చేసి, మొరార్జీ దేశాయ్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు.

Advertisement
Advertisement