India | 44 ఏండ్ల ఆధిపత్యానికి తెర.. రికర్వ్ ఆర్చరీలో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్
India | జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) టీమ్ఇండియా (India) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళ రికర్వ్ ఆర్చరీలో (Recurve Team Archery ) దక్షిణ కొరియా 44 ఏండ్ల ఆధిపత్యానికి తెరదించింది. హేమాహేమీలతో కూడిన ఆ జట్టును 5-3 తేడాతో చిత్తుచేసి చారిత్రాత్మక విజయం సాధించింది.
India | త్రినేత్ర న్యూస్: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) టీమ్ఇండియా (India) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళ రికర్వ్ ఆర్చరీలో (Recurve Team Archery ) దక్షిణ కొరియా 44 ఏండ్ల ఆధిపత్యానికి తెరదించింది. హేమాహేమీలతో కూడిన ఆ జట్టును 5-3 తేడాతో చిత్తుచేసి చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో ఈ విభాగంలో మొట్టమొదటి ఏషియాడ్ స్వర్ణం (Gold Medal) గెలుపొందింది.
సెమీస్‌లో 5-1తో చిత్తుచేసిన అంకితా భరత్, కీర్తి శర్మ, కుమ్‌కుమ్ మొహద్‌లతో కూడిన భారత్ జట్టు ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగింది. పదిసార్లు ఓలింపిక్ చాంపియన్లుగా నిలిచిన దక్షిణకొరియా (South Korea) జట్టులో ప్రపంచ నంబర్ 3 ఆర్చర్ కాంగ్ చేయాంగ్ కూడా ఉన్నారు. అయితే ప్రత్యర్థుల ఘనతలు ఏమాత్రం లెక్కచేయని అంకితా, కీర్తి, కుమ్‌కుమ్ త్రయం.. రికర్వ్ విభాగంలో కొరియా ఆధిపత్యాన్ని తలకిందులు చేస్తూ 5-3 తేడాతో విజయం సాధించింది.

సెట్ 1లో 54 పాయింట్లతో ఇరు జట్లు స్కోర్‌ను సమం చేశాయి. ఇక రెండో సెట్‌లోనూ 56 పాయిట్లతో చెరో 2 పాయింట్లతో సమానంగా నిలిచాయి. మూడో సెట్‌లో భారత్ 55 పాయింట్లు స్కోర్ చేయగా, కొరియా 52 స్కోర్ మాత్రమే చేయగలిగింది. దీంతో 4-2 పాయింట్లతో వెనుకబడిపోయింది. తుది సెట్‌లో రెండు జట్లు మళ్లీ 54 స్కోరు చేయడంతో టై అయింది. దీంతో భారత్ 5-3తో విజయం సాధించి కొరియా 44 ఏండ్ల ఆధిపత్యానికి చెక్‌పెట్టింది.
మరోవైపు ఈ స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నది. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మొత్తం 67 పతకాలు సాధించింది. ఇందులో 11 బంగారు పతకాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం: కేసీఆర్
- ●Shamshabad | విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు
- ●Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఉమ్మడి పాస్
- ●Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తించిన జెడ్ఎస్ఐ
- ●ECIL | ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు
- ●Horoscope | అక్టోబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు కొత్త కోణాలను అన్వేషిస్తారు!

KCR | గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం: కేసీఆర్

Shamshabad | విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఉమ్మడి పాస్

Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తించిన జెడ్ఎస్ఐ






