PM Modi | కాంగ్రెస్, వామపక్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కేరళం ప్రజలతో ప్రధాని మోదీ
PM Modi | కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని కేరళం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కేరళంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. కేరళంకు దేవుడు అపారమైన సహజ వనరులు, సామర్థ్యాన్ని ప్రసాదించాడన్నారు.
PM Modi | కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని కేరళం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కేరళంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. కేరళంకు దేవుడు అపారమైన సహజ వనరులు, సామర్థ్యాన్ని ప్రసాదించాడన్నారు. సముద్ర సంపద ద్వారా బ్లూ ఎకానమీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమలు-పర్యాటక రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ సారి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.
ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల తర్వాత మే 4న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళల మద్దతు తమ బలమన్న ప్రధాని.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీయేకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఈ ఎన్నికలు కేరళకు మేలు చేస్తాయని, గత ఐదేళ్లుగా అనూప్ తనతో కలిసి కష్టపడి పనిచేశాడని, నిజాయితీగా పని చేసే యువ నాయకుడిగా ఆయనను ప్రజలకు పరిచయం చేస్తున్నానన్నారు.
‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కేరళలో బీజేపీ కార్యకర్తలతో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా 5వేల శక్తి కేంద్రాల నుంచి 1.25 లక్షలకుపైగా కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే నిర్ణయానికి వచ్చారని కార్యకర్తలు తెలిపినట్టు పేర్కొన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, కొత్త వంతెనలు నిర్మించలేదని, మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు.
ప్రాథమిక సదుపాయాల లోపం ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపిందన్నారు. నిధుల విషయంలో కూడా ప్రధాని స్పందిస్తూ గతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కేంద్రంలో ఉన్నప్పుడు కేరళకు తక్కువ నిధులు వచ్చాయని, అయితే తమ ప్రభుత్వంలో ఐదింతలు ఎక్కువ నిధులు అందించామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినా అభివృద్ధిని సాధించాయని, గోవాలోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు. కేరళంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. మత్స్యకారులు సహా స్థానిక సమస్యలను పరిష్కరిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






