Independence Day | ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Independence Day | దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో ప్రధాన మంత్రి మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు.
Independence Day | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో ప్రధాన మంత్రి మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతర (Vande Mataram) గీతాన్ని పూర్తిగా ఆలపించారు. జాతీయ గీతం వందేమాతరం 150 ఏండ్ల ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఎర్రకోట వేదికగా సముచితంగా గౌరవించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. కాగా, ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయడం ఇది 13వ సారి.

కలసికట్టుగా కృషి చేద్దాం..
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన మహానీయుల ధైర్యం, త్యాగాలు, అంకితభావాన్ని స్మరించుకున్నారు. వారి కలలను సాకారం చేస్తూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
#WATCH | Delhi: For the first time, the National Song Vande Mataram is rendered during Independence Day celebrations at Red Fort.
Prime Minister Shri Narendra Modi leads the 80th Independence Day Celebrations from the Red Fort. pic.twitter.com/miSIlH6Dki
— ANI (@ANI) August 15, 2026
సంబంధిత వార్తలు

Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే
ఆగస్టు 14, 2026

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026

Gallantry Awards | 1,057 మందికి కేంద్ర పతకాలు.. తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- ●తెలంగాణ కేబినెట్ భేటీ వెనుక రేవంత్ ‘మాస్టర్ ప్లాన్’: బీఆర్ఎస్ కంచుకోటలపై ‘యంగ్ ఇండియా’ దెబ్బ... ఓట్ బ్యాంకే లక్ష్యంగా కొత్త వ్యూహం!
- ●Police Recruitment | మరో రెండేండ్లు.. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి పెంపు..
- ●ఎర్రకోట విచారణల నుండి నేవీ తిరుగుబాటు దాకా: తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన 5 సంచలన ఘట్టాలు!
- ●Horoscope | ఆగస్టు 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ప్రమాదం పొంచి ఉంది!
- ●Geetu Mohandas | టాక్సిక్ డైరెక్టర్ భర్త ఫేమస్ సినిమాటోగ్రాఫర్ - అల్లు అర్జున్ సినిమాకు కెమెరామెన్‌గా...

Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

తెలంగాణ కేబినెట్ భేటీ వెనుక రేవంత్ ‘మాస్టర్ ప్లాన్’: బీఆర్ఎస్ కంచుకోటలపై ‘యంగ్ ఇండియా’ దెబ్బ... ఓట్ బ్యాంకే లక్ష్యంగా కొత్త వ్యూహం!

Police Recruitment | మరో రెండేండ్లు.. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి పెంపు..

ఎర్రకోట విచారణల నుండి నేవీ తిరుగుబాటు దాకా: తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన 5 సంచలన ఘట్టాలు!



