Police Recruitment | మరో రెండేండ్లు.. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి పెంపు..
Police Recruitment | ఉద్యోగార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో (Police Recruitment) అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని (Age Relaxation) మరో 2 ఏండ్ల పాటు పొడిగించింది.
Police Recruitment | త్రినేత్ర.న్యూస్: ఉద్యోగార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. యూనిఫాం సర్వీసుల (Uniformed Services)ఉద్యోగ నియామకాల్లో (Police Recruitment) అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని (Age Relaxation) మరో 2 ఏండ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా (ట్రాన్స్‌పోర్ట్), అటవీ (ఫారెస్ట్) శాఖలలో జరిగే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఉన్న 5 ఏండ్ల సడలిపు.. తాజాగా ఇచ్చిన 2 ఏండ్లతో మెుత్తం 7 ఏండ్లకు చేరింది.
సాధారణంగా ఎస్ఐ స్థాయి పోస్టుల నియామకాలకు 21 నుంచి 25 ఏండ్లు, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 18 నుంచి 22 ఏండ్ల వయోపరిమితి ఉంటుంది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విడుదల చేస్తున్న అన్ని నోటిఫికేషన్లలో ఐదేండ్ల సడలింపు ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల హోంశాఖ పరధిలో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఈ ఏడాది మే 18 నుంచి ఏడాదిపాటు అమల్లో ఉండేలా ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మరో రెండేండ్ల సడలింపు రావడంతో వేలాది మంది యువతకు యూనిఫాం సర్వీసుల్లో ఉద్యోగం సాధించేందుకు అదనపు అవకాశం లభించనుంది.
నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో చాలా మంది వయస్సు మీరడంతో అనర్హులుగా మారుతున్నారని, వయోపరిమితి పెంచాలంటూ పోలీసు ఉద్యోగార్థులు పెద్దఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఇందిరాపార్కు వద్ద ఎమ్మెల్సీ కోదండరామ్‌కు నిరుద్యోగులు చుక్కలు చూపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండంతో వయోపరిమితిలో సడలింపు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది.
19 నుంచి దరఖాస్తులు
పోలీస్, ఎస్‌పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) వరకు అప్లయ్ చేసుకోవచ్చు. జూలై 29న ఈ ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
- ఎస్ఐ స్థాయి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులకు రూ.1,500గా ఫీజు ఉంది.
- పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులకు రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.
- అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్‌ప్రింట్ బ్యూరో), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) వంటి సాంకేతిక పోస్టులకు కూడా ఇదే విధమైన రుసుములు వర్తిస్తాయి.
సంబంధిత వార్తలు

Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
అక్టోబర్ 17, 2026

Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 17, 2026

Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
- ●Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!
- ●E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..
- ●Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..
- ●blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి
- ●Palapitta | దసరా మండపాల వద్ద పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ

Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Zero Sugar Diversion Ethanol | ఇథనాల్ తయారీలో చక్కెరపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం!

E2E Networks | ఏడాదిలో 250 శాతం లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల పంట ఇచ్చిన షేర్..

Apple | ఐఫోన్ 17కు డిమాండ్ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్..



