త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తుల‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి: ర‌ఘునంద‌న్ రావు

Raghunandan Rao | సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆస్తులపై (Assets) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Oct 2, 2026, 12.48 pm IST

Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తుల‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి: ర‌ఘునంద‌న్ రావు
Advertisement

Raghunandan Rao | త్రినేత్ర న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆస్తులపై (Assets) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతలు దొంగలేనని ఆరోపించారు. తమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ (High Court probe) జరిపించాలని కోరుతూ ఇద్ద‌రు నేత‌లు హైకోర్టుకు సంయుక్తంగా లేఖ రాయాలన్నారు. సోమవారం వరకు వారిద్దరూ ఉత్తరం రాయకపోతే స్వయంగా తానే హైకోర్టుకు ఈ విషయంపై ఉత్తరం రాస్తానన్నారు. లేదంటే ముగ్గురం వెళ్లి హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం ఇద్దామని వెల్ల‌డించారు. తన ఆస్తులపై కూడా విచారణ జరపాలని ఉత్తరం ఇస్తానని పేర్కొన్నారు.

తమ ఆస్తుల నుంచి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల (Family Assets) వరకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ చేసిన విష‌యం తెలిసిందే. తమది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇరువురు నేత‌లు త‌మ ఆస్తుల‌పై విచార‌ణ‌కు లేఖ రాయాలంటూ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement