వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ఈ గీతంపై ప్రత్యేక చర్చను ప్రారంభించారు. వందేమాతరం గీతంపై ఆయన సభ ప్రారంభం కాగానే ప్రసంగించారు. ఇది ఒక చారిత్రక సందర్భం అన్న ప్రధాని మోదీ, స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసిన మంత్రమన్నారు. దేశాన్ని ఏకం చేసిన శక్తి వందేమాతరానిదని కొనియాడారు. 100 ఏళ్ల పండుగ సమయంలో ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు వందేమాతరం ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు భారత్ బ్రిటీష్ పాలనలో ఉన్నదన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీ కొరల్లో చిక్కుకుందన్నారు. ఆనాడు దేశభక్తులు జైళ్లలో ఉన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికే ఊపిరిలూదిన గీతం, ప్రేరణనిచ్చిన గీతం 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న సమయంలో చీకటి కాలాన్ని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు 150 ఏళ్ల పండుగ ఆ గతాన్ని, ఆ గౌరవాన్ని పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం ఒక నినాదం కాదు వందేమాతరం అనేది కేవలం ఒక నినాదం కాదు.. అది ఒక మంత్రం, స్వాతంత్ర్యోద్యమానికి శక్తిని అందించిన మంత్రం. ప్రేరణను అందించి, త్యాగం అంటే ఏంటో చూపించిన మంత్రం.. అని మోదీ వ్యాఖ్యానించారు. మనం ఎన్నో చారిత్రక మైలురాళ్లను దాటాం. రాజ్యాంగానికి 75 ఏళ్లు, సర్దార్ పటేల్, బిర్సా మొండా 150వ జయంతి ఉత్సవాలు, గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ తరుణంలో వందేమాతరం 150వ సంవత్సరం వేడుకలు జరుపుకోవడం భారతదేశ ప్రజలకు గర్వకారణం అని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే మనకు స్ఫూర్తి వందేమాతరం విషయంలో పక్షం లేదు.. ప్రతిపక్షం లేదు. ఇక్కడ నాయకత్వం, ప్రతిపక్షం ఏం లేదు. మనందరం వందేమాతరం రుణం తీర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఈ గీతం దేశాన్ని ఏకం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడానికి, మన స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఈ గీతం మనకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది.. అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. #WATCH | PM Narendra Modi says, "... Vande Mataram is a mantra, a slogan which gave energy, inspiration, and showed the path for sacrifice and penance to the freedom movement. It is a matter of pride that we are becoming witnesses to 150 years of Vande Mataram. It is a historic… pic.twitter.com/pHmsmS66uE — ANI (@ANI) December 8, 2025 #WATCH | PM Narendra Modi says, "... When Vande Mataram completed 50 years, India was under British rule. When Vande Mataram completed 100 years, India was in the clutches of Emergency... At that time, the patriots were imprisoned. When the song that inspired our freedom… pic.twitter.com/Kww4ewc6wM — ANI (@ANI) December 8, 2025 #WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn — ANI (@ANI) December 8, 2025