PM Modi | ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి.. దుర్వినియోగం చేస్తే విధ్వంసమే : ప్రధాని మోదీ
PM Modi | కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఢిల్లీ (Delhi)లో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit )లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
PM Modi | కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఢిల్లీ (Delhi)లో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit )లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. టెక్నాలజీ కేంద్రంగా భారత్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఏఐ (AI) సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉందని.. మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాదు, ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి అని దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
"ప్రపంచ జనాభాలో ఆరో వంతు ఉన్న భారత్ సాంకేతికత కేంద్రంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోంది. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోంది. దేశానికి యువతే ఆస్తి. ఏఐ వినియోగంలో యువత ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ రంగాల సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది. ఏఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇక్కడ జరుగుతోంది. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు ఈ వేదిక దోహదం చేస్తుంది. ఏఐ విజన్‌తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్‌కే కాదు.. దక్షిణాసియాకే గర్వ కారణం" అని ప్రధాని అన్నారు.
కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం..
అంతేకాదు, ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉందన్నారు. ఏఐ కేంద్రంగా ఇండియా మారుతోందని చెప్పారు. ఏఐ రెండు వైపులా పదునున్న అస్త్రం అని.. వాడే విధానాన్ని బట్టి ఫలితాలు, పరిణామాలు ఉంటాయన్నారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చినట్లు ప్రధాని గుర్తు చేశారు. కానీ, యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందని కొనియాడారు. ఏఐ సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనాత్మకతకు వేదికగా నిలిచిందని తెలిపారు. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు AI ఇంపాక్ట్ సమ్మిట్ దోహదం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






