PM Modi | ప్రధాని పొదుపు బాట.. కాన్వాయ్‌ని కుదించిన మోదీ
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) పొదుపు బాటపట్టారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్: ప్రధాని మోదీ (PM Modi) పొదుపు బాటపట్టారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్‌లో (Convoy) వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీంతోపాటు కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల వినియోగాన్ని (Electric Vehicles) పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కి సూచించినట్టు సమాచారం. అయితే దీనికోసం కొత్తవాహనాలు కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండానే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 10 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్‌పూలింగ్, ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా పొదుపు చర్యలను ప్రారంభించారు.
కాగా, ప్రధాని పిలుపుమేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించాలని ఆదేశింఆచరు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తమ కాన్వాయ్‌లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించించారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. పలువురు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






