PM Modi | తారిక్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ..?
PM Modi | తారిక్ రెహమాన్ (Tarique Rahman) స్వీకారోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఆహ్వానించే యోచనలో బీఎన్‌పీ ఉన్నట్లు తెలిసింది.
PM Modi | బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు బంగ్లా ప్రధానిగా ఆ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ (Tarique Rahman) బాధ్యతలు చేపట్టబోతున్నారు. తారిక్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అయితే, ఈ కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కూడా ఆహ్వానించే యోచనలో బీఎన్‌పీ ఉన్నట్లు తెలిసింది. ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీ ముఖ్య నేతగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పొరుగుదేశంతో స్నేహసంబంధాలను పునరుద్ధరించుకోవాలని చూస్తున్న ప్రధాని.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తారిక్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ సహకారం ఉంటుందని రహ్మాన్‌కు తెలియచేసి, శుభాకాంక్షలు అందచేసినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ పరిణామాల వేళ.. గత కొన్ని రోజులుగా దెబ్బతిన్న బంగ్లా-భారత్ మధ్య సంబంధాలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
బంగ్లా పీఠంపై డార్క్ ప్రిన్స్..
తారక్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. సుమారు 17 ఏళ్లపాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఖలీదా జియా అనారోగ్యంతో ఉండటంతో.. 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసాన్ని వీడి గతేడాది డిసెంబర్‌లో ఢాకాలో అడుగుపెట్టారు. ఇక అదే నెల 30న ఆయన తల్లి ఖలీదా జియా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ బంగ్లా నేషనల్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీఎన్‌పీ (BNP) 212 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు బీఎన్‌పీ ప్రకటించింది. ఒకప్పుడు తారిక్‌ను ప్రతిపక్షాలు డార్క్ ప్రిన్స్‌గా విమర్శించేవారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






