త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | అస్సాంలో చారిత్ర‌క ఘ‌ట్టం.. హైవేపై దిగిన‌ ప్ర‌ధాని మోదీ విమానం C-130J

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఆస్సాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఓ చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిషృత‌మైంది.

D

National | Published On Feb 14, 2026, 12.00 pm IST

PM Modi | అస్సాంలో చారిత్ర‌క ఘ‌ట్టం.. హైవేపై దిగిన‌ ప్ర‌ధాని మోదీ విమానం C-130J
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఆస్సాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఓ చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిషృత‌మైంది. ప్ర‌ధాని ప్ర‌యాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ అస్సాం హైవేపై దిగింది (Assam Highway). ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (Emergency Landing Facility)పై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ (C-130J) ల్యాండ్ అయింది. ఈశాన్య భారతంలో ఏర్పాటైన తొలి ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఇదే కావ‌డం విశేషం. దేశ రక్షణ రంగంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల పరంగా ఇది కీల‌క ఘ‌ట్టంగా అధికారులు భావిస్తున్నారు.

అస్సాం ఎగువ ప్రాంతంలోని జాతీయ రహదారి-127 పై దిబ్రూగఢ్-మోరన్ మార్గంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF)ని నిర్మించారు. సమీపంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లేదా దిబ్రూగఢ్ విమానాశ్రయం వంటివి అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేనప్పుడు, ఈ హైవే భారత వాయుసేన (IAF)కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇది చైనా సరిహద్దుకు 300 కి.మీ దూరంలో ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న‌ప్పుడు భ‌ద్ర‌తా ద‌ళాలు వేగంగా స్పందించేందుకు ఇది చాలా కీల‌కం. టేకాఫ్‌, ల్యాండింగ్‌కు అనుకూలంగా దీనిని డిజైన్ చేశారు.

ఇక ఈ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ గురించి ఇప్ప‌టికే ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈఎల్ఎఫ్ అత్య‌వ‌స‌ర ప్ర‌తిస్పంద‌న‌కు చాలా కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. స‌వాలుతో కూడుకున్న ప‌రిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్య‌క‌లాపాల‌ను స‌కాలంలో మోహ‌రించ‌డానికి వీలు క‌ల్పిస్తుంద‌ని తెలిపారు. రూ.100 కోట్ల వ్య‌వ‌యంతో దీన్ని నిర్మించారు. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఇప్పటికే ఈ ఈఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి ELF 2021లో రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ఈశాన్య భార‌తంలో ఇదే తొలి ఈఎల్ఎఫ్ కావ‌డం విశేషం.

https://x.com/PTI_News/status/2022539693838254226

Advertisement
Advertisement