త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi in Tamilnadu | డీఎంకే కౌంట్‌డౌన్ స్టార్ట్.. తమిళనాడు బీజేపీదే..!

ఈ సభకు వచ్చిన జన సందోహమే డీఎంకే ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇచ్చిందని, తమిళనాడు మార్పు కోసం ఎదురు చూస్తోందనడానికి మీరే సాక్షి అంటూ సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

J

National | Published On Jan 23, 2026, 5.41 pm IST

PM Modi in Tamilnadu | డీఎంకే కౌంట్‌డౌన్ స్టార్ట్.. తమిళనాడు బీజేపీదే..!
Advertisement

PM Modi in Tamilnadu | కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగిన తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒకే అస్త్రంతో విరుచుకుపడ్డారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే(DMK) పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారి అభివృద్ధిని మరిచిపోయిందని విమర్శించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, మార్పు తథ్యం అని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్ ఎన్డీఏకి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు బీజేపీ ప్రభుత్వాన్నే కోరుకుంటోంది

కేరళ పర్యటన అనంతరం తమిళనాడు చేరుకున్న ప్రధాని మోదీ మధురాంతకంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డీఎంకే.. సీఎంసీ ప్రభుత్వంగా మారుతోందని.. సీఎంసీ అంటే కరప్షన్, మాఫియా, క్రైమ్ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని భూస్థాపితం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

జన సందోహమే సాక్షి

ఈ సభకు వచ్చిన జన సందోహమే డీఎంకే ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇచ్చిందని, తమిళనాడు మార్పు కోసం ఎదురు చూస్తోందనడానికి మీరే సాక్షి అంటూ సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన డీఎంకే

రెండు సార్లు డీఎంకేను తమిళనాడు ప్రజలు నమ్మారు. కానీ.. తమిళనాడు ప్రజల నమ్మకాన్ని డీఎంకే ప్రభుత్వం మోసం చేసింది. వాగ్దానాలన్నీ ఏమయ్యాయి. ఒక్క పని కూడా చేయలేదు. డీఏంకే సంకెళ్ల నుంచి తమిళనాడుకు విముక్తి కల్పిస్తాం. త్వరలోనే తమిళనాడు కూడా అభివృద్ధి చెందుతుందని మోదీ భరోసా ఇచ్చారు.

https://x.com/narendramodi/status/2014653630423695673

 

Advertisement

తాజావార్తలు

Advertisement