Piyush Goyal | రాహుల్‌వి అన్నీ అబద్ధాలే.. బంగ్లా కన్నా మనదే బెటర్ డీల్ : పీయుష్ గోయల్
ఈ మధ్యంతర ఒప్పందం చివరి దశకు చేరుకుందని, బంగ్లా కన్నా మనదే బెటర్ డీల్ అని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు.
Piyush Goyal | భారత్ - యూఎస్ ట్రేడ్ డీల్‌పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యూఎస్‌కి భారత్ నుంచి ఎగుమతి చేసే ఉత్పత్తులపై 25 శాతం నుంచి 18 శాతానికి సుంకాలు తగ్గిస్తున్నట్టు యూఎస్ ప్రకటించింది. దానిపై ఇరు దేశాలు కూడా సంతకాలు చేశాయి. కానీ ఇంకా అది అమలులోకి రావాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 9న అమెరికా.. బంగ్లాదేశ్‌తోనూ ట్రేడ్ డీల్ చేసుకుంది. ప్రతీకార సుంకాలను 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆ ఆగ్రిమెంట్‌లో ఇరు దేశాలు పేర్కొన్నాయి. అలాగే, టెక్స్‌టైల్స్ మీద జీరో టారిఫ్ ఉంటుందని తెలపడంతో అందరి చూపు బంగ్లాదేశ్‌పై పడింది. అదేంటి.. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్ మీద గరిష్ఠంగా 18 శాతం వరకు టారిఫ్ వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ.. చిన్న దేశం బంగ్లా ఎగుమతులపై జీరో టారిఫ్ ఏంటి అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ ట్రేడ్ డీల్ అసలు లొసుగును కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ బయటపెట్టారు.
యూఎస్ పంపించే మెటీరియల్‌తో తయారు చేస్తేనే జీరో టారిఫ్
ఇక్కడే ఒక లొసుగు ఉంది. బంగ్లాదేశ్ ఎగుమతి చేసే అన్ని టెక్స్‌టైల్స్‌పై జీరో శాతం టారిఫ్ ఉండదు. యూఎస్.. బంగ్లాదేశ్‌కి టెక్స్‌టైల్ మెటీరియల్ పంపిస్తుంది. వాళ్లు పంపించిన మెటీరియల్‌తో బంగ్లాదేశ్ తయారు చేసిన టెక్స్‌టైల్స్ మీదనే జీరో టారిఫ్ ఉంటుంది. అందులోనూ యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే మెటీరియల్ చాలా కాస్ట్‌లీ. అందుకే దీనిపై భారత్ కూడా ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఎందుకంటే మన దగ్గర దొరికే మెటీరియల్ చాలా చీప్. యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటే దాని తయారీ ఖర్చు పెరుగుతుంది.
రాహుల్‌వి అన్నీ డ్రామాలే
లోక్ సభలో రాహుల్ గాంధీ యూఎస్ ట్రేడ్ డీల్ విషయంలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల భారత్ కంటే బంగ్లాదేశ్‌కే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని రాహుల్ ఆరోపించడంపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదో పెద్ద అబద్ధం అని.. రా మెటీరియల్ యూఎస్ నుంచి కొనుగోలు చేస్తేనే, ఆ రా మెటీరియల్‌తో తయారు చేసిన క్లాత్‌ని యూఎస్‌కి ఎగుమతి చేస్తే అప్పుడు జీరో ప్రతీకార సుంకాన్ని యూఎస్ విధిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కి కూడా యూఎస్ ఆ అవకాశం ఇచ్చిందని.. దానిపై త్వరలోనే విధివిధానాలు వెల్లడవుతాయని పీయుష్ గోయల్ వెల్లడించారు. ఈ మధ్యంతర ఒప్పందం చివరి దశకు చేరుకుందని, బంగ్లా కన్నా మనదే బెటర్ డీల్ అని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి అన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






