త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pinarayi Vijayan | ధర్మదంలో సీఎం విజయన్‌ విజయం.. గెలుపు కోసం చెమటోడ్చిన సీనియర్‌ నేత..!

Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధర్మదం అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి ఎదురైంది. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీపీఎం నేతకు ఎన్నికల్లో 85,614 ఓట్లు వచ్చాయి.

P

National | Published On May 4, 2026, 9.02 pm IST

Pinarayi Vijayan | ధర్మదంలో సీఎం విజయన్‌ విజయం.. గెలుపు కోసం చెమటోడ్చిన సీనియర్‌ నేత..!
Advertisement

Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధర్మదం అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి ఎదురైంది. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీపీఎం నేతకు ఎన్నికల్లో 85,614 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ పై 19,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2016లో 36వేలకుపైగా, 2021లో 50వేలకుపైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి మాత్రం మెజారిటీ భారీగా పడిపోయింది. అయితే, ఈసారి తొలి రౌండ్లలోనే పరిస్థితి భిన్నంగా కనిపించింది. కొన్ని పంచాయతీల్లో సీపీఐ(ఎం) ఆధిక్యం ఉండాల్సిన చోట కూడా రషీద్ ముందంజలో నిలిచారు.

ఒక దశలో ఆయనకు 2,800కిపైగా ఓట్ల లీడ్ రావడంతో ఎల్డీఎఫ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. తొలుత వెనుకపడ్డ విజయన్‌.. ఆ తర్వాత రౌండ్లలో క్రమంగా ఆధిక్యం సాధిస్తూ వెళ్తారు. సీపీఎం పార్టీకి బలమైన కేడర్‌ ఉండడంతో చివరలో పుంజుకొని విజయం సాధించారు. ఒక దశలో విజయన్‌ గెలుస్తారా? అన్న ప్రశ్న ఎదురైంది. ముఖ్యమంత్రిపై పోటీ చేసేంత బలమైన నేత కాకపోయినా యువనేతగా ఎదుగుతున్నారు. 2021లోనూ తలిపరంబలో ఎంవీ గోవిందన్‌పై పోటీ చేసిన సీపీఎం మెజారిటీని తగ్గించారు. తాజాగా ధర్మదంలోనూ తొలి దశలోనే ఆధిక్యం సాధించి గట్టి పోటీ ఇచ్చారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి గతంలో ఉన్న సంప్రదాయానికి చెక్‌ పెట్టింది. కానీ, వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావించగా.. పరాజయం పాలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి సంపూర్ణ మెజారిటీని సాధించింది.

అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. శబరిమల అంశం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. శబరిమల ఆలయంలో బంగారం మాయం ఆరోపణలు ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారాయి. అలాగే, విజయన్ పాలనపై, ఆయన నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రచార సమయంలోనూ ఆయన చేసిన పలు వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ప్రచార సమయంలో జరిగిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పలువురు మంత్రులు ఊహించని రీతిలో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. మే 4న సీపీఎం నేత టీపీ చంద్రశేఖరన్‌ వర్థంతి. ఆయన హత్య కేరళ రాజకీయాలపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. ఆయన భార్య ఆర్‌ఎంపీ నేత కేకే రేమా వడకరలో 14,862 ఓట్ల మెజారితీ సాధించారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్‌పై ఆమె స్పందిస్తూ కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement