త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Election Result | చెన్నైలో తండ్రి నివాసానికి విజయ్‌.. ఓటమిని అంగీకరిస్తున్నాన్న స్టాలిన్‌..!

Tamil Nadu Election Result | తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో విజయ్‌ పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

P

National | Published On May 4, 2026, 9.24 pm IST

Tamil Nadu Election Result | చెన్నైలో తండ్రి నివాసానికి విజయ్‌.. ఓటమిని అంగీకరిస్తున్నాన్న స్టాలిన్‌..!
Advertisement

Tamil Nadu Election Result | తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో విజయ్‌ పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 90 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. విజయం గెలిచిన నేపథ్యంలో విజయ్ తన తండ్రి ఆశీర్వాదాలు తీసుకోవడానికి చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న విజయ్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ఆనందాన్ని విజిల్ కొడుతూ వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘మాకు చాలా సంతోషంగా ఉంది. నా కుమారుడిని కలిశాను’ అని తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయితగా గుర్తింపు పొందిన ఆయన, విజయ్ తొలి సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం దక్కించుకున్న నేపథ్యంలో విజయ్ తన విజయం ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు చెన్నై నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించనుంది. మరోవైపు, విజయ్ పార్టీ విజయోత్సవాల్లో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో డీఎంకే కూటమి 56 చోట్ల విజయం సాధించగా మరో 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక అన్నా డీఎంకే పార్టీ 41 చోట్ల గెలిచి.. 12 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఓటమిని అంగీకరించిన స్టాలిన్‌

తమిళనాడులో డీఎంకే కూటమి ఓటమిని స్టాలిన్‌ అంగీకరించారు. డీఎంకే ఆదర్శ ప్రతిపక్షంగా పనిచేస్తుందన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నానని, ఆదర్శ ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పని చేస్తామన్నారు. ‘మేం ప్రజల తీర్పును తలవంచి అంగీకరిస్తున్నాం. విజేతలకు అభినందనలు. నేను కేవలం ఓటు వేసిన వారి కోసమే కాకుండా.. ఓటు వేయడం మరిచిపోయిన వారి కోసం కూడా పరిపాలన కొనసాగించారు. అందువల్ల ద్రవిడ మున్నేట్ర కజగం రాజకీయ ప్రస్థానం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రజలకు ఆదర్శ పాలక పార్టీగా పనిచేసిన డీఎంకే, ఇకపై ఆదర్శ ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుంది’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

Advertisement
Advertisement