త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayan | కేరళలో ముగిసిన విజయన్‌ అధ్యాయం..! సీఎం పదవికి రాజీనామా..!

Vijayan | కేరళం రాజకీయాల్లో మరో చరిత్ర ముగిసిపోయింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి గవర్నర్ రాజేంద్ర వీ అర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

P

National | Published On May 4, 2026, 9.43 pm IST

Vijayan | కేరళలో ముగిసిన విజయన్‌ అధ్యాయం..! సీఎం పదవికి రాజీనామా..!
Advertisement

Vijayan | కేరళం రాజకీయాల్లో మరో చరిత్ర ముగిసిపోయింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి గవర్నర్ రాజేంద్ర వీ అర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని విజయన్‌ను కోరారు. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌కు 35 సీట్లు మాత్రమే దక్కగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మూడు సీట్లకు పరిమితమైంది. విజయన్ రాజీనామాతో ఆయన పదేళ్ల పదవీకాలం ముగిసిపోయింది. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన.. కేరళలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాల సంప్రదాయాన్ని మార్చిన నేతగా గుర్తింపు పొందారు.

2021లో ఆయన తిరిగి గెలుపొందడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలిచింది. అయితే, ఈసారి ఎన్నికల ఫలితాలు ఎల్డీఎఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, ప్రజలకు దూరమవడం వంటి అంశాలు ఓటమికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరుసగా వరదలు, కరోనా సంక్షోభం వంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నా.. అవినీతి ఆరోపణలు, పాలనా శైలిపై విపక్షాల విమర్శలు ఆయన ప్రభుత్వాన్ని వెంటాడాయి. ఎల్డీఎఫ్ అంతర్గత సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌ రాజకీయాల్లో విజయన్‌ పాత్రపై చర్చ మొదలైంది. అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు పదేళ్ల పాలనకు ముగింపు పలికిన ఈ రాజీనామా.. కేరళ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్టుగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement