Penguin India | నరవణే పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని ప్రకటించిన పెంగ్విన్ ఇండియా.. చిక్కుల్లో రాహుల్
Penguin India | భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదిపేస్తోంది.
Penguin India | భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాకముందే అందులోని అంశాలు, పీడీఎఫ్ కాపీలు బయటకు వచ్చాయి. పబ్లిష్ కాని ఈ పుస్తకంలోని అంశాలను లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడంతో దీనిపై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India) స్పందించింది. ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని.. దీనిపై అన్ని హక్కులు తమకే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పుస్తకంపై నెలకొన్న వివాదంపై ప్రకటన విడుదల చేసింది.
నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’కి ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా లభించకపోవడంతో ముద్రణ చేపట్టలేదని వివరించింది. పుస్తకంలోని ఒక్క పేజీ కూడా పబ్లిష్ కాలేదని స్పష్టం చేసింది. డిజిటల్ రూపంలోనూ మార్కెట్‌లోకి విడుదల చేయలేదని తెలిపింది. ఈ బుక్‌పై తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నట్లు స్పష్టం చేసింది. అనధికారికంగా ఈ బుక్ ను ప్రింట్ చేసిన, ఆన్ లైన్ లో రిలీజ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చిక్కుల్లో రాహుల్..
ర్యాండమ్ ఇండియా ప్రకటనతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. అయితే, ఈ పుస్తకంపై ర్యాండమ్ ఇండియా ప్రకటనతో ఆయన న్యాయపరమైన చిక్కులు తప్పవని పలువురు అభిప్రాయయపడుతున్నారు.
ఈ బుక్‌లో ఏముందంటే..?
జనరల్ నరవణే తన అనుభవాలను పొందుపరుస్తూ రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం రక్షణ శాఖ, విదేశాంగ శాఖల అనుమతి (Clearance) కోసం వేచి ఉంది. ఇందులో అగ్నిపథ్ స్కీమ్, తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రతిష్టంభన వంటి కీలకమైన అంశాలను నరవణే ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, పుస్తకం ప్రచురణకు నోచుకోకముందే, అందులోని కొన్ని భాగాలు ఫోటోల రూపంలోనూ, పీడీఎఫ్ రూపంలోనూ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పోలీసుల చర్యలు
అనుమతి లేకుండా, ప్రచురణ కాకుండానే పుస్తకాన్ని లీక్ చేయడం, కాపీరైట్ ఉల్లంఘన కింద పరిగణించబడుతుంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పుస్తకంలోని కంటెంట్‌ను ఎవరు లీక్ చేశారు? ఎక్కడి నుంచి ఇది మొదలైంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఈ పుస్తకాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajnath Singh | నరవణే బుక్ వివాదం.. ఆర్మీ చీఫ్‌ల రచనలపై అలాంటి ఆంక్షలేవీ లేవు : రాజ్‌నాథ్ స్పష్టీకరణ
ఫిబ్రవరి 23, 2026

Kiren Rijiju | సరిహద్దు విషయాల గురించి రాహుల్‌కు అవగాహన లేదు : కిరణ్ రిజుజు
ఫిబ్రవరి 16, 2026

Four Stars of Destiny | నరవణే పుస్తకంపై వివాదం.. పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
ఫిబ్రవరి 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



