Kiren Rijiju | సరిహద్దు విషయాల గురించి రాహుల్‌కు అవగాహన లేదు : కిరణ్ రిజుజు
Kiren Rijiju | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Kiren Rijiju | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ భద్రతా సమస్యలను రాజకీయం చేయకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు సరిహద్దు విషయాల గురించి ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని ఆరోపించారు. ఏదైనా మాట్లాడేముందు సరిహద్దు గురించి తెలుసుకోవాలని సూచించారు.
2020 గల్వాన్ ఘర్షణలను ప్రస్తావిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే (MM Naravane) రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పుస్తకం ఇంకా పబ్లిక్ కాలేదు. అయితే, అందులోని కొన్ని అంశాలను పార్లమెంట్‌లో రాహుల్ ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఇక పబ్లిష్ కాని ఈ బుక్ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ వివాదం వేళ కిరణ్ రిజుజు ఇవాళ అరుణాచల్ ప్రదేశ్‌లోని బుమ్లా పాస్ సమీపంలోని భారత్-చైనా సరిహద్దును (India-China border) సందర్శించారు.
ఈ సందర్భంగా సరిహద్దు వద్ద కిరణ్ రిజుజు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "జాతీయ భద్రతా సమస్యలను రాజకీయం చేయకూడదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సరిహద్దు సమస్య గురించి ఏమీ తెలియదు. ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆయన తనను తాను అవగాహన చేసుకోవాలి. సరిహద్దు గురించి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. ప్రచురించని పుస్తకం గురించి మాట్లాడకూడదు. అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి తీవ్రంగా పరిగణించాలి" అని కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






