త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Four Stars of Destiny | న‌ర‌వ‌ణే పుస్త‌కంపై వివాదం.. పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు నోటీసులు

Four Stars of Destiny | ప్ర‌ముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ ఇండియా (Penguin Random House India)కు ఢిల్లీ పోలీసులు (Delhi Police) తాజాగా నోటీసులు ఇచ్చారు.

D

National | Published On Feb 11, 2026, 1.51 pm IST

Four Stars of Destiny | న‌ర‌వ‌ణే పుస్త‌కంపై వివాదం.. పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
Advertisement

Four Stars of Destiny | భారత మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే (MM Naravane) ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పేరుతో రాసిన ఆత్మ‌క‌థ దేశ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. ఇంకా ప‌బ్లిష్‌కాని ఈ పుస్త‌కంలోని కొన్ని పేజీలు, పీడీఎఫ్‌లు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ పుస్త‌కం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ ఇండియా (Penguin Random House India)కు ఢిల్లీ పోలీసులు (Delhi Police) తాజాగా నోటీసులు ఇచ్చారు. పుస్త‌కానికి సంబంధించిన పలు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోరుతూ నోటీసులు పంపారు. ఈ కేసు ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని అందులో పేర్కొన్నారు.

ప‌బ్లిష్ కాని ఈ పుస్త‌కంలోని అంశాల‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi) స‌భ‌లో ప్ర‌స్తావించ‌డంతో దీనిపై ర‌గ‌డ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్ ర్యాండ‌మ్ హౌస్ ఇండియా (Penguin Random House India) స్పందించింది. ఈ పుస్త‌కం ఇంకా ప‌బ్లిష్ కాలేద‌ని.. దీనిపై అన్ని హ‌క్కులు త‌మ‌కే ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పుస్త‌కంపై నెల‌కొన్న వివాదంపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

న‌ర‌వ‌ణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’కి ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా లభించకపోవడంతో ముద్రణ చేపట్టలేదని వివరించింది. పుస్త‌కంలోని ఒక్క పేజీ కూడా ప‌బ్లిష్ కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. డిజిట‌ల్ రూపంలోనూ మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌లేద‌ని తెలిపింది. ఈ బుక్‌పై త‌మ‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక హ‌క్కులు ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అనధికారికంగా ఈ బుక్ ను ప్రింట్ చేసిన, ఆన్ లైన్ లో రిలీజ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించింది.

మ‌రోవైపు ఈ వివాదంపై ఎంఎం న‌ర‌వ‌ణే ఇప్ప‌టికే స్పందించిన విష‌యం తెలిసిందే. తన పుస్తకం ప‌బ్లిష‌ర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా విడుదల చేసిన అధికారిక ప్రకటనను ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రీట్వీట్ చేశారు. ప్రస్తుతం స్టేట‌స్ ఇదేనన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిణామాల వేళ కేసు ద‌ర్యాప్తులో చేరాలంటూ పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Advertisement
Advertisement