త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metro pillar collapses | ఆటోపై కూలిన మెట్రో పిల్ల‌ర్‌.. ప‌లువురికి గాయాలు

Metro pillar collapses | మ‌హారాష్ట్ర ముంబై (Mumbai)లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్ల‌ర్ కూలి (Metro pillar collapses) ప‌లువురికి గాయాల‌య్యాయి.

D

National | Published On Feb 14, 2026, 2.22 pm IST

Metro pillar collapses | ఆటోపై కూలిన మెట్రో పిల్ల‌ర్‌.. ప‌లువురికి గాయాలు
Advertisement

Metro pillar collapses | మ‌హారాష్ట్ర ముంబై (Mumbai)లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్ల‌ర్ కూలి (Metro pillar collapses) ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ములుంద్ (Mulund) ప్రాంతంలో శ‌నివారం చోటు చేసుకుంది. ఎల్‌బీఎస్ రోడ్డు (LBS Road)లో ఉన్న జాన్స‌న్ అండ్ జాన్స‌న్ ఫ్యాక్ట‌రీ ముందుఇవాళ మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్ల‌ర్‌లోని కొంత భాగం ఉన్న‌ట్టుండి కూలిపోయి కింద వెళ్తున్న ఆటోరిక్షాపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో కనీసం న‌లుగురు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. అదే స‌మ‌యంలో అటుగా వెళ్తున్న ఓ కారుకు కూడా పిల్ల‌ర్ త‌గిలింది. దీంతో ఆ కారు కుడివైపు భాగం దెబ్బ‌తిన్న‌ది.

ప్ర‌మాద స‌మాచారం తెలుసుకున్న అగ్నిమాప‌క ద‌ళం, పోలీసు సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితి ప‌రిశీలించారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మార్గంలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను అధికారులు నిలిపివేశారు.

https://x.com/RoshanKrRaii/status/2022578987764191570

Advertisement
Advertisement