Parliament Special Session | నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. లోక్‌సభ ముందుకు మూడు బిల్లులు
Parliament Special Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) గురువారం ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, లోక్‌సభ స్థానాల పెంపు (Delimitation Bill) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.
Parliament Special Session | త్రినేత్ర.న్యూస్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) గురువారం ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, లోక్‌సభ స్థానాల పెంపు (Delimitation Bill) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలంతా తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని పార్టీలు విప్ జారీ చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు (Women's Reservation Bill) మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు, డీలిమిటేషన్‌ను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు.
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం గురువారం దానిని లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పుడున్న లోక్‌సభ స్థానాలను గరిష్ఠంగా 850 వరకు పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ఠ లోక్‌సభ సభ్యుల సంఖ్య 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 20గా ఉంది. కాగా, ఆర్టికల్ 81(3)లో 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి, గతంలోని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని పునర్విభజించడానికి కేంద్రం తాజా బిల్లు తీసుకొస్తున్నది. 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలు కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334Aలకు సవరణలను ప్రతిపాదించింది.
అయితే లోక్‌సభ సీట్లను 850కి ఏ ప్రాతిపదికన పెంచుతున్నారనే విషయాన్ని బిల్లులో పేర్కొనలేదు. పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను కేంద్రం తీసుకొస్తున్నది.
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

Mahesh Kumar Goud | మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లా?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



