Parliament Session | రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ సభ ముందుకు ఆ రెండు బిల్లులు!
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) సోమవారం (జూలై 20న) ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్లు (Women's Reservation), డిలిమిటేషన్ (Delimitation) బిల్లులను మళ్లీ సభ (Parliament Session) ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.
Parliament Session | త్రినేత్ర.న్యూస్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) సోమవారం (జూలై 20న) ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్లు (Women's Reservation), డిలిమిటేషన్ (Delimitation) బిల్లులను మళ్లీ సభ (Parliament Session) ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఉభయ సభల్లోనూ రెండు బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. రెండోంతుల మూడో వంతు మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే చర్యలు ముమ్మరంచేసింది.
టీఎంసీలో (TMC) తిరుగుబాటు, 20 మంది ఎంపీలు ఎన్డీయేకు (NDA) మద్దతు తెలిపేలా చూడటంతోపాటు శివసేన ఉద్దవ్ వర్గం (Shivsen UBT) ఎంపీలు ఆరుగురు షిండే వర్గంలో చేరడం వంటివి ఇందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమిలోని (INDIA) డీఎంకే (DMK) పార్టీ కాంగ్రెస్‌కు (Congress) వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం, ఎన్సీపీ కూడా ఎన్డీయే (NDA) వైపు అడుగులు వేస్తుండటంతో.. కేంద్రం కీలకంగా భావిస్తున్న ఆ రెండు బిల్లులు ఈసారి ఆమోదం పొందడం సులభమేనని చెబుతున్నారు.
అఖిలపక్ష సమావేశం..
మరోవైపు ఆగస్టు 13 వరకు జరుగనున్న పార్లమెంట్ ((Parliament) వర్షాకాల సమావేశాలు.. ఉభయ సభలూ సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) నిర్వహిస్తున్నది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీలో ప్రధాన పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య తీవ్ర స్థాయి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ సమావేశాన్ని వేదికగా చేసుకుని నీట్ యూజీ పేపర్ లీక్ సహా కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి.
కొత్త బిల్లులు ఇవే..
- జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు, 2026: వందేమాతరం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే కఠిన శిక్షలు విధించేలా 1971 నాటి చట్టాన్ని ఈ బిల్లు సవరిస్తుంది.
- జనన, మరణాల నమోదు సవరణ బిల్లు, 2026: ఆలస్యంగా నమోదు చేసే జనన, మరణాల ప్రక్రియపై కఠిన నిబంధనలను తీసుకువస్తారు.
- ఆదాయపు పన్ను సవరణ బిల్లు, 2026: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చే ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తెస్తున్నారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, 2026: సీజేఐ (CJI) తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది.
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026: MSME రంగాన్ని బలోపేతం చేయడం, పునర్వ్యవస్థీకరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!






