Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే
Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందేనని.. నాలెడ్జ్ ముందు నియంతృత్వం నిలవదని ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. విద్యార్థి ఉద్యమం ముందు ఆధిపత్య అహంకారం తలవంచక తప్పలేదన్నారు.
- విద్యార్థులను అలసత్వం చేసిన ఫలితమే ఈ రాజీనామా
- ఈ చైతన్య రథం ఆగదు.. ఆగొద్దు కూడా
- ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్‌కుమార్
Dasoju Sravan Kumar | త్రినేత్ర.న్యూస్: జ్ఞాన సమాజం రోడ్డెక్కితే ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందేనని.. నాలెడ్జ్ ముందు నియంతృత్వం నిలవదని ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. విద్యార్థి ఉద్యమం ముందు ఆధిపత్య అహంకారం తలవంచక తప్పలేదన్నారు. విద్యార్థుల ఆవేదనను అలసత్వం వహించిన ఫలితమే ఈ రాజీనామా అని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై దాసోజు శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇది చదువుకున్న యువ సమాజం. చట్టం, హక్కులు, భవిష్యత్తు పట్ల స్పష్టత ఉన్న జ్ఞానం కలిగిన యువ సమాజం. వారు రోడ్డెక్కితే ఎలాంటి అహంకారమైనా దిగిరాక తప్పదు. విద్యార్థి ఉద్యమం ముందు అధిపత్య అహంకారం తలవంచక తప్పలేదు. అధికార మదం, ఆధిపత్య అహంకారం ఎంతటిదైనా.. ప్రజాస్వామ్యంలో సమష్టి విద్యార్థి చైతన్యం ముందు మోకాలిల్లాల్సిందే. ఇది యువశక్తి విజయం.. ప్రశ్నించే గొంతుకల విజయం అని దాసోజు వివరించారు.
జై విద్యార్థి ఐక్యత.. జై యువశక్తి..
యువత తిరగబడితే ఏ పీఠమైనా కదలాల్సిందే. పరిపాలనలో జవాబుదారీతనం మరిచి, బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తే యువత చూస్తూ ఊరుకోదు. ఆధిపత్య అహంకార ధోరణులకు కాలం చెల్లిందని ఈ తీర్పు స్పష్టం చేసింది. ముందే స్పందించి ఉంటే ఈ పరాభవం తప్పేది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరచి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానాలి. ఇది ముగింపు కాదు.. విద్యా వ్యవస్థలో పూర్తి పారదర్శకత, నిజాయితీ సాధించే వరకు ఈ పోరాట చైతన్య రథం ఆగదు.. ఆగొద్దు.. జై విద్యార్థి ఐక్యత! జై యువశక్తి! అని దాసోజు శ్రవణ్ నినదించారు.
సంబంధిత వార్తలు

Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్‌రావు
జులై 25, 2026

Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్
జులై 25, 2026

Abhijeet Dipke | మేం కాక్రోచ్‌లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే
జులై 25, 2026
తాజావార్తలు
- ●Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి
- ●Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్
- ●CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
- ●iQOO Z11 Lite | ఐక్యూ జడ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..
- ●Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్‌రావు
- ●Sonam Wangchuk | ఇది భయం వీడిన ప్రజల విజయం : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్

Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి

Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు

iQOO Z11 Lite | ఐక్యూ జడ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..



