Poonch | మళ్లీ పాక్ కవ్వింపులు.. ఎల్‌వోసీని దాటిన డ్రోన్
Poonch | జమ్ము కశ్మీర్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్‌లో ఆదివారం పాకిస్తాన్‌కు చెందిన అనుమానాస్పద డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడ్డాయి. ఫార్వర్డ్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ల అసాధారణ కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
Poonch | జమ్ము కశ్మీర్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్‌లో ఆదివారం పాకిస్తాన్‌కు చెందిన అనుమానాస్పద డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడ్డాయి. ఫార్వర్డ్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ల అసాధారణ కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. పరిశీలనలో అవి పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లుగా నిర్ధారణ కావడంతో భద్రతా దళాలు గాల్లోకి పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాయి. కాల్పుల ధాటికి డ్రోన్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వారు స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో గత మూడు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరి 27న కూడా పూంచ్ సెక్టార్‌లో సరిహద్దు రేఖ సమీపంలో ఒక డ్రోన్ కనిపించగా, భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది. వరుసగా డ్రోన్ చొరబాట్లు చోటుచేసుకుంటుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేదా మాదకద్రవ్యాలను చేరవేసే ప్రయత్నం ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజా ఘటనలో డ్రోన్ల ద్వారా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు జారవిడిచారా అన్న దానిపై బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరాన్–ఇజ్రాయెల్, పాక్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రికత్తలు తగ్గాయి. అయితే, ప్రస్తుతం మళ్లీ పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతోంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



