త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | ఢిల్లీకి ఉగ్ర‌ముప్పు.. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో భ‌ద్ర‌తా ద‌ళాలు హై అల‌ర్ట్‌

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)కి ఉగ్ర‌ముప్పు పొంచి ఉంద‌ని నిఘా వ‌ర్గాలు (security agencies) హెచ్చ‌రించాయి.

D

National | Published On Feb 21, 2026, 11.01 am IST

Delhi | ఢిల్లీకి ఉగ్ర‌ముప్పు.. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో భ‌ద్ర‌తా ద‌ళాలు హై అల‌ర్ట్‌
Advertisement

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)కి ఉగ్ర‌ముప్పు పొంచి ఉంద‌ని నిఘా వ‌ర్గాలు (security agencies) హెచ్చ‌రించాయి. పాకిస్థాన్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్ర‌వాదులు ఢిల్లీలోని ఎర్ర‌కోట (Red Fort) స‌మీపంలో, చాందినీ చౌక్ (Chandni Chowk)లోని ఓ ఆల‌యం స‌హా దేశ వ్యాప్తంగా ఉన్న ఇత‌ర ప్ర‌ముఖ మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో పేలుళ్ల‌కు ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఐఈడీతో దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 6న పాకిస్థాన్‌లోని ఓ మ‌సీదు వ‌ద్ద జ‌రిగిన పేలుళ్ల‌కు ప్ర‌తీకారంగా దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలను ఉటంకిస్తూ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

దాడి స‌మాచారం అందిన వెంట‌నే ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థ‌లు హై అల‌ర్ట్ అయ్యాయి. ఎర్ర‌కోట‌, చాందినీ చౌక్ స‌హా ప‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాలు, ర‌ద్దీ ఏరియాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. అనుమానాస్ప‌ద వ్య‌క్తులను వాహ‌నాల‌ను నిశిన‌తంగా ప‌రిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 6న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదు వ‌ద్ద‌ జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించారు. సుమారు 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యత వహించింది.

కాగా, గ‌తేడాది నవంబర్ 10న ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. కారు పేలుడులో 12 మంది మరణించారు. ఈ దాడితో దేశంలో వైట్‌కాల‌ర్ టెర్ర‌ర్ మాడ్యూల్ బ‌ట్ట‌బ‌య‌లైంది. ఎర్ర‌కోట వ‌ద్ద పేలిన కారును ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న‌ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీదిగా పోలీసులు తేల్చారు. ఈ దాడి జ‌రిగిన మూడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఢిల్లీకి ఉగ్ర‌ముప్పు పొంచి ఉంద‌న్న హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

Advertisement
Advertisement