త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha polls | ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే.. మ‌ళ్లీ ఎన్డీయేనే, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయంటే?

Lok Sabha polls | ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మేనియా న‌డుస్తున్న‌ది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ టారీఫ్‌ల బెదిరింపులు, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు, ఐరోపా కూట‌మి (EU)తో వాణిజ్య‌ ఒప్పందం వంటి విష‌యాల్లో మోదీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌తో ఆయన‌పై ప్ర‌జ‌లు అపార విశ్వాసాన్ని క‌న‌బ‌రుస్తున్నారు.

G

National | Published On Jan 30, 2026, 8.49 am IST

Lok Sabha polls | ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే.. మ‌ళ్లీ ఎన్డీయేనే, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మేనియా న‌డుస్తున్న‌ది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ టారీఫ్‌ల బెదిరింపులు, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు, ఐరోపా కూట‌మి (EU)తో వాణిజ్య‌ ఒప్పందం వంటి విష‌యాల్లో మోదీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌తో ఆయన‌పై ప్ర‌జ‌లు అపార విశ్వాసాన్ని క‌న‌బ‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ ఎన్నికలు (Lok Sabha polls) జ‌రిగితే మ‌రోసారి బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి (NDA) అధికారం ద‌క్కించుకోనుందని ఓ స‌ర్వేలో తేలింది. 2024 నాటి ఫ‌లితాలే మ‌రోసారి రిపీట్ అవుతాయ‌ని, ఎన్డీయే కూట‌మి త‌న భ‌లాన్ని మ‌రింత పెంచుకుంటుంద‌ని ఇండియాటుడే సీవోట‌ర్ మూడ్ ఆఫ్ ద నేష‌న్ (Mood of the Nation survey) స‌ర్వే తేల్చింది. బీజేపీ స్థానాలు పెరుగుతాయ‌ని, ఈసారి మెజార్టీ మార్కును దాటి సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని వెల్ల‌డించింది. మ‌రోసారి కాంగ్రెస్‌కు ప్ర‌తిపక్ష పాత్ర త‌ప్ప‌ద‌ని, సీట్లు కూడా త‌గ్గుతాయ‌ని పేర్కొంది.

ఢిల్లీ, బీహార్, మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ ఎన్నిక‌లు, ముంబై న‌గ‌ర‌పాల‌క ఎన్నికల్లో ఘ‌న విజ‌యం సాధించిన బీజేపీకి.. కొన‌సాగింపుగా ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే తిరుగే ఉండ‌ద‌ని తెలిపింది. 352 స్థానాల‌తో ఎన్డీయే కూట‌మి త‌న ఆధిక్యాన్ని కొన‌సాగిస్తుంద‌ని వెల్ల‌డింది. అయితే 400 సీట్లే త‌మ ల‌క్ష్యమ‌ని 2024 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఇచ్చిన పిలుపున‌కు ఇది చాలా త‌క్కువ అని పేర్కొంది. కాగా, గ‌తంలో కంటే త‌న స్థానాల‌ను మెరుగుప‌రుచుకుంటుంని వెల్ల‌డించింది.

మ‌రోవైపు 2024 సావ్ర‌త్రిక ఎన్నిక‌ల్లో 234 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి.. ఈసారి 182 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా త‌న బ‌లాన్ని కోల్పోతుంద‌ని, 80 స్థానాల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపింది. గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ నేతృత్వంలో హ‌స్తం పార్టీ 99 స్థానాలు గెలిచిన విష‌యం తెలిసిందే.

కాగా, బీజేపీ మాత్రం లోక్‌స‌భలో త‌న స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకుంటుంద‌ని స‌ర్వే పేర్కొంది. 2024 ఎన్నిక‌ల్లో 240 స్థానాలు గెలుపొంది, మెజార్టీ మార్కు 272కు 32 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో నితీశ్ కుమార్‌, చంద్ర‌బాబు వంటివారి స‌హాయంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే 287 సీట్ల‌తో బీజేపీ సొంతంగా గ‌వ‌ర్న‌మెంట్‌ను ఫామ్ చేస్తుంద‌ని వెల్ల‌డించింది.

ఓట్ల శాతంలో కూడా ఎన్డీయే మెరుగ‌వుతుంద‌ని, 2024లో 44 శాతం ఓట్లు రాగా, ప్ర‌స్తుతం అది 47 శాతానికి పెరుగుతుంద‌ని పేర్కొంది. ఇక హ‌ర్యానా, ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, బీహార్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూసిన‌ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ఓట్ల శాతం 39 శాతానికి ప‌డిపోతుంద‌ని తెలిపింది. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఈ కూట‌మి 44 శాతం ఓట్ షేర్ సాధించింది. కాగా, ప్ర‌ధానిగా మోదీకి 57 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు.

తాజాగా వెల్ల‌డైన‌ స‌ర్వే ఫ‌లితాల‌తో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న‌ ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, అస్సాం, పాండిచ్చేరిలో బీజేపీకి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. బెంగాల్‌, కేర‌ల‌, త‌మిళ‌నాడులో క‌మ‌లం పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారిగా అధికారాన్ని ద‌క్కించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement